హైదరాబాద్: ఆసియాకప్ 2023 టోర్నీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనతో ప్రారంభించాడు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన అతను పాకిస్థాన్ పేస్ ధాటికి దారుణంగా విఫలమయ్యాడు. షాహిన్ అఫ్రిది స్వింగ్ బౌలింగ్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పసికూన నేపాల్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఆరంభంలో రోహిత్ తడబడ్డాడు. నేపాల్ పేసర్ వేసిన బంతులకు బీట్ అయ్యాడు.
మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ వరుస బౌండరీలు బాదడంతో ఊపిరి పీల్చుకున్న రోహిత్ కాస్త టైమ్ తీసుకొని చెలరేగాడు. పాత రోహిత్ శర్మలా బంతిని మైదానం బయటికి బాదాడు. సహజంగా రోహిత్ శర్మకు స్టార్టింగ్ ప్రాబ్లమ్. రోహిత్ క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకుంటాడు.

ఈ సమయంలో సహచర ఓపెనర్ పరుగులు రాబడితే రోహిత్ ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా టైమ్ తీసుకొని పిచ్‌ను బాగా రీడ్ చేస్తాడు. ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగుతాడు. గతంలో శిఖర్ ధావన్ అతనికి అండగా నిలిచేవాడు. పవర్ ప్లేలో అటాకింగ్ గేమ్ ఆడుతూ అతను పరుగులు రాబడితే మరో ఎండ్‌లో రోహిత్.. యాంకర్ రోల్ పోషించేవాడు. క్రీజులో కుదురుకున్న తర్వాత విధ్వంసకర బ్యాటింగ్‌తో శిఖర్ ధావన్‌ను ధాటేసేవాడు.
రోహిత్ సెట్ అయిన తర్వాత ధావన్ ఔటైనా.. అదే జోరు కొనసాగించేవాడు. 2019 వన్డే ప్రపంచకప్‌తో పాటు అతను మూడు డబుల్ సెంచరీలు బాదిన ఇన్నింగ్స్‌ల్లోనూ రోహిత్ సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకున్నాడు. శిఖర్ ధావన్ తర్వాత ఓపెనర్లుగా యువ ప్లేయర్ రావడం.. ఎక్కువగా టీ20లు ఆడాల్సి రావడంతో రోహిత్ ధాటిగా ఆడాలనే యోచనలో రాంగ్ షాట్ సెలెక్షన్‌తో విఫలమయ్యాడు.
సహచర ఓపెనర్ అండగా నిలిచిన ప్రతీసారి అతను ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఆసియాకప్ 2023, వన్డే ప్రపంచకప్ టోర్నీల్లోనూ రోహిత్ శర్మ చెలరేగాలంటే.. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ బ్యాట్ ఝులిపించాల్సిందే. శుభ్‌మన్ అండగా నిలిస్తే రోహిత్ విధ్వంసం సృష్టిస్తాడు. అప్పుడు ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవు.

కేఎల్ రాహుల్‌తో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మ సెట్ అయ్యేందుకు రాహుల్ టైమ్ ఇస్తే రోహిత్ చెలరేగేవాడు. ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ శుభ్‌మన్ గిల్ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవ్వడంతో రోహిత్ శర్మ అనవసర ఒత్తిడికి గురయ్యాడు.
ఈ క్రమంలోనే షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో బంతిని అంచనా వేయలేక విఫలమయ్యాడు. నేపాల్ మ్యాచ్‌లో మాత్రం శుభ్‌మన్ గిల్ రెండు బౌండరీలు బాదడంతో రోహిత్ స్వేచ్చగా తన దైన శైలిలో చెలరేగాడు. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌లోనూ శుభ్‌మన్ గిల్ ఒత్తిడికి గురి కాకుండా అటాకింగ్ గేమ్ ఆడితే రోహిత్ శర్మ చేతిలో పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు తప్పవు.
పరిస్థితులతో సంబంధం లేకుండా రోహిత్ శర్మ క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకోవాలని మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సూచించాడు. 5-6 ఓవర్లు రిస్కీ షాట్స్ ఆడకుండా క్రీజులో నిలబడితే రోహిత్ తిరుగుండదని తెలిపాడు.