IND vs NZ: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ప్రపంచకప్‌లో 20 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌పై విజయం సాధించింది.
ఇక టీమిండియా తదుపరి మ్యాచ్‌ను ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు వారం రోజుల బ్రేక్ లభించడం.. దసరా పండుగ ఉండటంతో టీమిండియా ఆటగాళ్లకు రెండు రోజుల సెలవులు ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ న్యూజిలాండ్‌తో విజయానంతరం టీమిండియా ఆటగాళ్లంతా ధర్మశాల్లోనే ఉండిపోయారు.

సెలవులు తీసుకొని ఇంటికి వెళ్లేందుకు ఆటగాళ్లు నిరాకరించినట్లు తెలుస్తోంది. అలాగే ధర్మశాల వీడేందుకు కూడా విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో రెండు రోజుల పాటు ధర్మశాల్లోనే ఉండి హిమాలయాల అందాలను ఆస్వాదించాలని భారత ఆటగాళ్లు డిసైడ్ అయినట్లు జట్టుతో ఉన్న ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు.
ముందస్తు షెడ్యూల్ ప్రకారం టీమిండియా సోమవారం ధర్మశాల నుంచి బయల్దేరాలని, కానీ ఆటగాళ్ల రిక్వెస్ట్ ప్రయాణాన్ని రిషెడ్యూల్ చేశామని సదరు అధికారి పేర్కొన్నాడు. 'టీమిండియా ఈ రోజు ప్రయాణం చేయడం లేదు. మరో రెండు రోజుల పాటు ధర్మశాలలోనే ఉండనుంది. లక్నో వేదికగా జరిగే తదుపరి మ్యాచ్ ప్రిపరేషన్స్ ప్రారంభించే ముందు ఆటగాళ్లు రెస్ట్ తీసుకోనున్నారు.'అని ఆ అధికారి తెలిపాడు.
దసరా పండుగ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు ఇంటికి వెళ్లనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికి వెళ్లడం కంటే ధర్మశాలలో ఉండి ఇక్కడి అందాలను ఆస్వాదించడం ఉత్తమమని ఆటగాళ్లు భావించినట్లు తెలుస్తోంది.
ప్రపంచకప్‌లో ఒక్క టీమిండియానే 9 మ్యాచ్‌లను 9 వేదికల్లో ఆడనుంది. వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడం ఆటగాళ్లకు సవాల్‌గా మారనుంది. ఈ క్రమంలోనే ప్లేయర్ల వర్క్‌లోడ్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్ నిశితంగా పరిశీలిస్తోంది.