Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: రోహిత్ శర్మను ఊరిస్తున్న జి‘గేల్’ రికార్డ్!

World Cup 2023లో టీమిండియా కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ దుమ్మురేపుతున్నాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ విధ్వంసకర బ్యాటింగ్‌తో టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందిస్తున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 66.63 సగటుతో 398 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

విధ్వంసకర బ్యాటింగ్‌తో పరుగుల మోత మోగిస్తున్న రోహిత్ శర్మ.. అరుదైన రికార్డులను కూడా తన పేరిట లిఖించుకుంటున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది 50 సిక్సర్ల ఫీట్ సాధించిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాడిగానూ చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టాడు. క్రిస్ గేల్ 483 మ్యాచ్‌ల్లో 553 సిక్స్‌లు బాదగా.. రోహిత్ 453 మ్యాచ్‌ల్లోనే 556 సిక్స్‌లతో ఈ ఫీట్ సాధించాడు.

World Cup 2023: Rohit Sharma 7 sixes away from creating an all-time record ahead of IND vs SL match

ఇక క్రిస్ గేల్‌కు సంబంధించిన మరో సిక్సర్ల రికార్డుపై రోహిత్ శర్మ కన్నేసాడు. వన్డే వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచేందుకు రోహిత్ 7 సిక్సర్ల దూరంలో నిలిచాడు. శ్రీలంకతో గురువారం జరిగే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

తాజా ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటికే 20 సిక్స్‌లు బాదాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడి 7 సిక్సర్లు కొడితే ఓ ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్రకెక్కుతాడు. ఈ క్రమంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును అధిగమిస్తాడు.

ఈ జాబితాలో గేల్ టాప్‌లో ఉన్నాడు. 2015 ప్రపంచకప్‌లో అతను 26 సిక్స్‌లు బాదాడు. ఇయాన్ మోర్గాన్ 2019లో 22 సిక్సర్లు, ఏబీ డివిలియర్స్ 2015లో 21 సిక్స్‌లు బాది రోహిత్ శర్మ కన్నా ముందున్నారు. రోహిత్ శర్మ తర్వాత తాజా ప్రపంచకప్‌లోనే డేవిడ్ వార్నర్ 19 సిక్స్‌లతో కొనసాగుతున్నాడు. వార్నర్ కూడా చెలరేగితే గేల్ రికార్డును అందుకోవచ్చు.

శ్రీలంకపై రోహిత్ శర్మకు మెరుగైన రికార్డు ఉండటం.. డబుల్ సెంచరీ బాదిన అనుభవం ఉండటంతో...ఆజట్టుపైనే హిట్ మ్యాన్ ఈ ఫీట్ సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Story first published: Wednesday, November 1, 2023, 20:32 [IST]
Other articles published on Nov 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+