Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: సరిపోని శ్రీలంక పోరాటం.. సౌతాఫ్రికా ఘన విజయం!

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌ 2023లో సౌతాఫ్రికా బోణీ కొట్టింది. శ్రీలంక‌తో శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో 102 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో శ్రీలంక చేసిన పోరాటం సరిపోలేదు. సౌతాఫ్రికా బౌలర్ల రఫ్ఫాడించడంతో ధాటిగా ఆడాలనే ఆతృతలో శ్రీలంక వికెట్లను పారేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఓడినా శ్రీలంక తమ పోరాటంతో ఆకట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 428 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్. ఎయిడెన్ మార్క్‌రమ్(54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106)తో పాటు ఓపెనర్ క్వింటన్ డికాక్(84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 100), రాసీ వాన్ డెర్ డస్సెన్(110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 108) సెంచరీలతో చెలరేగారు.

 Records tumble as South Africa beat Sri Lanka by 102 runs

చివర్లో డేవిడ్ మిల్లర్(21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్), హెన్రీచ్ క్లాసెన్(20 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 32) మెరుపులు మెరిపించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బవుమా(8) ఒక్కడే విఫలమయ్యాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(2/86) రెండు వికెట్లు తీయగా.. కాసున్ రజిత(1/90), మతీష పతీరణ(1/95), దునిత్ వెల్లలాగే(1/81) తలో వికెట్ తీసారు.

సౌతాఫ్రికా బ్యాటర్ల ధాటికి పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 44.5 ఓవర్లలో 326 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఓపెనర్లు విఫలమైనా కుశాల్ మెండీస్(42 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76), చరిత్ అసలంక(65 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79), డసన్ షనక(62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68) హాఫ్ సెంచరీలతో రాణించారు.

సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(3/68) మూడు వికెట్లు తీయగా.. కేశవ్ మహరాజ్, కగిసో రబడా, మార్కో జాన్సెన్ రెండేసి వికెట్లు తీసారు. లుంగి ఎంగిడికి ఓ వికెట్ దక్కింది. భారీ లక్ష్యచేధనలో శ్రీలంక బ్యాటర్లు అద్బుత పోరాటం కనబర్చారు. రిక్వైడ్ రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో ధాటిగా ఆడాలనే ప్రయత్నంలో వికెట్లు పారేసుకున్నారు.

శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో అక్టోబర్ 10న హైదరాబాద్ వేదికగా తలపడనుంది. సౌతాఫ్రికా అక్టోబర్ 12 ఆస్ట్రేలియాతో లక్నో వేదికగా ఆడనుంది.

Story first published: Saturday, October 7, 2023, 22:51 [IST]
Other articles published on Oct 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+