Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఇంగ్లండ్‌తో వామప్ మ్యాచ్.. భారత్‌దే బ్యాటింగ్!

గువాహటి: వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వామప్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ముందుగా బ్యాటింగ్ చేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. బౌలర్లను ఫ్రెష్‌గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నానని, మధ్యాహ్నం ఎండలో బౌలింగ్ చేస్తే బౌలర్లు అలసిపోతారని చెప్పాడు.

వామప్ మ్యాచ్ కేవలం సంప్రదాయమేనని, గత 7-8 మ్యాచ్‌లుగా మేం నిలకడగా రాణించామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది.

Rain starts after India Choose to bat first in warm-up match vs England

గువహాటి వేదికగా మరికొద్దిసేపట్లో ఇంగ్లండ్‌తో తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది. జట్టులోని ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ఇప్పటికే సందేహాలు తొలగిపోగా.. తుది జట్టు కాంబినేషన్‌పై కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు కావాల్సిదంతా మరింత ఆత్మవిశ్వాసంతో.. ప్రపంచకప్‌కు సిద్ధం కావడమే.

పూర్తి స్థాయి జట్టుతో బరిలో దిగి సత్తా చాటడమే రోహిత్ సేనకు కావాలి. వామప్ మ్యాచ్‌లతో మెగా టోర్నీకి కావాల్సిన సన్నదతను పూర్తి చేసుకోవడంపై టీమిండియా ఫోకస్ పెట్టింది. ఆస్ట్రేలియాపై సిరీస్‌ నెగ్గి ఉత్సాహంతో ఉన్న భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సన్నాహక మ్యాచ్‌లో విజయం సాధించాలని కోరుకుంటోంది.

ఇంగ్లండ్‌ కూడా జట్టులోని వనరుల్ని పూర్తిగా పరిశీలించుకోవాలని భావిస్తోంది. ఇరుజట్లు వీలైనంత ఎక్కువ మంది ఆటగాళ్లను మైదానంలోకి దించనున్నాయి. వాస్తవానికి వార్మప్‌ మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా తమ వూహాల్ని బయట పెట్టదు. కానీ దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించడాన్ని ఇంగ్లండ్‌ అలవాటుగా మార్చుకుంది.

బెయిర్‌స్టో, బట్లర్‌, మలన్‌, బెన్‌ స్టోక్స్‌, హ్యారీ బ్రూక్‌, లివింగ్‌స్టోన్‌, మొయీన్‌ అలీల విధ్వంసక బ్యాటింగ్‌ కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో తమ బౌలర్లను పరీక్షించుకోడానికి ఇంగ్లండ్‌తో వార్మప్‌ పోరు మంచి అవకాశంగా భారత్‌ భావిస్తోంది.

ఇంగ్లండ్ జట్టు: జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్, కీపర్), లియామ్ లివింగ్ స్టోన్, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, సామ్ కరణ్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, గస్ అత్కిన్సన్, రీస్ టోప్లీ

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా .

Story first published: Saturday, September 30, 2023, 14:24 [IST]
Other articles published on Sep 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+