Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఆస్ట్రేలియాతో మ్యాచ్.. గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్ ద్రవిడ్!

చెన్నై: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ గుడ్ న్యూస్ చెప్పాడు. డెంగ్యూ భారిన పడిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌గానే ఉన్నాడని తెలిపాడు. టీమిండియా మెడికల్ టీమ్ అతని ఆరోగ్యస్థితి పర్యవేక్షిస్తూ మెరుగైన చికిత్స అందిస్తుందని చెప్పాడు.

ఇంకా అతను భారత జట్టుకు అందుబాటులోనే ఉన్నాడని, మ్యాచ్ సమయానికి పూర్తిగా కోలుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. మెగా టోర్నీలో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే చెన్నైకి చేరిన ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి.

 Rahul Dravid

అయితే శుభ్‌మన్ గిల్‌ డెంగ్యూ భారిన పడ్డాడని, తొలి మ్యాచ్ ఆడటం లేదని వార్తలు వచ్చాయి. డెంగ్యూ ఫీవర్ కారణంగా గిల్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనలేదు.

ఈ క్రమంలోనే శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. రాహుల్ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. 'ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ బాగానే ఉన్నాడు. మా మ్యాచ్‌కు ఇంకా 36 గంటల సమయం ఉంది. మెడికల్ టీమ్ శుభ్‌మన్ గిల్‌ను పర్యవేక్షిస్తుంది. ఇప్పటికీ అతను జట్టుకు అందుబాటులోనే ఉన్నాడు. తొలి మ్యాచ్‌కు దూరం కాలేదు. మ్యాచ్ సమయానికి అతను పూర్తిగా కోలుకుంటాడని మేం ఆశిస్తున్నాం.'అని తెలిపాడు.

ఇక చెన్నై పిచ్‌ను అర్థం చేసుకోవడంపై ఫోకస్ పెట్టామని తెలిపిన రాహుల్ ద్రవిడ్.. మైదాన పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలను సిద్దం చేస్తున్నామని తెలిపాడు.

'చెన్నై పిచ్‌ను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎంత రీడ్ చేసినా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయడంపైనే విజయవకాశాలు ఉంటాయి. ఈ ప్రపంచకప్‌ గెలవాలంటే పిచ్ రీడ్ చేస్తే సరిపోదు. పరిస్థితులకు అనుగుణంగా రాణించడం కీలకం.'అని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

ఆసియా కప్‌తో పాటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అద్భుతమైన ఫామ్ కనబర్చిన గిల్ అనారోగ్యం బారిన పడటం టీమిండియాకు ఇబ్బంది పెట్టే అంశమే. ఈ ఏడాది వన్డేల్లో భారత్ తరఫున అతనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.

శుభ్‌మన్ గిల్ దూరమైతే అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

Story first published: Friday, October 6, 2023, 19:44 [IST]
Other articles published on Oct 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+