తలకెక్కిన విజయం గర్వం.. టీమిండియా ఆటగాళ్లను అవమానించిన కమిన్స్, మ్యాక్స్‌వెల్!
World Cup 2023: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ హద్దులు ధాటారు. కామన్‌సెన్స్ లేకుండా ప్రవర్తించి భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. వన్డే ప్రపంచకప్ 2023 విజయంతో వచ్చిన గర్వం తలకెక్కడంతో ప్రొఫెషనల్ ప్లేయర్స్‌మనే విషయాన్నే మరిచిపోయారు.
భారత క్రికెట్ జట్టుపై ఉన్న అక్కసుతో ఓ ఆస్ట్రేలియా మీడియా పేజీ క్రియేట్ చేసిన జుగుప్సాకరమైన పోస్ట్‌ను లైక్ చేసిన కమిన్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. వన్డే ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శనతో ఫైనల్ చేరిన టీమిండియా కీలక పోరులో మాత్రం తడబడిన విషయం తెలిసిందే.

ఓటమెరుగని జట్టుగా వరుస 10 విజయాలు సాధించిన టీమిండియా.. ఫైనల్లో ఆసీస్‌ను మాత్రం ఓడించలేకపోయింది. పేలవ బ్యాటింగ్‌కు దురదృష్టం కూడా తోడవ్వడంతో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో మరోసారి తృటిలో ఐసీసీ టైటిల్‌ను చేజార్చుకుంది. ఈ ఓటమి నేపథ్యంలో ఆస్ట్రేలియా మీడియా పేజీ భారత ఆటగాళ్లను తీవ్రంగా అవమానించింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రాల బేబీ ఫొటోలతో ఓ మీమ్ క్రియేట్ చేసిన సదరు ఆస్ట్రేలియా మీడియా పేజీ.. వీరందరికి ట్రావిస్ హెడ్ జన్మనిచ్చినట్లు జుగుప్సాకరమైన పోస్ట్ క్రియేట్ చేసింది. బెడ్‌పై ట్రావిస్ హెడ్ ఉండగా.. నర్స్‌లంతా భారత ఆటగాళ్లను ఎత్తుకున్నట్లు ఈ పోస్ట్ ఉంది.
దీనికి 'సౌత్ ఆస్ట్రేలియన్ వ్యక్తి 11 మందికి జన్మనిచ్చి రికార్డ్ సృష్టించాడు'అని క్యాప్షన్‌గా పేర్కొంది. ఈ పోస్ట్‌ను గ్లేన్ మ్యాక్స్‌వెల్‌తో పాటు ఆసీస్ మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ లైక్ చేయగా.. ప్యాట్ కమిన్సీ ఫన్నీ ఏమోజీలను కామెంట్ చేశాడు.
భారత ఆటగాళ్లను అవమానించేలా ఉన్న ఈ జుగుప్సాకరమైన పోస్ట్‌ను ఆసీస్ ఆటగాళ్లు లైక్ చేయడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. భారత్ పేరు చెప్పుకొని బతికే ఆసీస్ ఆటగాళ్లకు ఇది తగదని కామెంట్ చేస్తున్నారు. కమిన్స్, గ్లేన్ మ్యాక్స్‌వెల్‌లను ఐపీఎల్ ఆడకుండా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications