Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాహుల్‌తో సెటప్ చేసి వికెట్ తీసాడు.. ఆరో బౌలింగ్ ఆప్షన్ కోహ్లీనే: టీమిండియా బౌలింగ్ కోచ్

IND vs NZ Semi Final: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా ఆరో బౌలింగ్ ఆప్షన్ విరాట్ కోహ్లీ అని బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తెలిపాడు. నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయడమే కాకుండా 9 ఏళ్ల తర్వాత వన్డేల్లో వికెట్ సాధించాడు. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.

కోహ్లీ వేసిన వైడ్‌బాల్‌ను అనవసరంగా ఆడి ఎడ్వర్డ్స్ వికెట్ సమర్పించుకున్నాడు. మ్యాచ్ చూసిన అందరూ ఇలానే అనుకున్నారు. కానీ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ బిగించిన ఉచ్చులో ఎడ్వర్డ్స్ చిక్కుకున్నాడని టీమిండియా బౌలింగ్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన పరాస్ మాంబ్రే.. కోహ్లీ బౌలింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.

World Cup 2023: Paras Mhambrey says We are going to push Virat Kohli to bowl in the death overs

'కేఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ వేసిన వికెట్ ప్రణాళిక బాగుంది. బ్యాటర్ ఫైన్ లెగ్ ఆడుతాడనే విషయాన్ని పసిగట్టి... రాహుల్‌కు సైగ చేస్తూ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడు. కోహ్లీ సైగలతో అప్రమత్తమైన రాహుల్ అద్భుతంగా అందుకున్నాడు.

బౌలింగ్‌లో విరాట్ కోహ్లీని ఎలా వాడుకోవాలనేదానిపై రోహిత్ శర్మతో నేను మాట్లాడాను. కొత్త బంతితో కోహ్లీ స్వింగ్ చేయగలడు. పవర్ ప్లేలో అతనితో బౌలింగ్ చేయించవచ్చు. అయితే మిడిల్ ఓవర్లలో కోహ్లీ ఎలా వేస్తాడనేదే మా ముందున్న అతిపెద్ద సవాల్. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లీ అదరగొట్టాడు. మేం పెట్టిన టెస్ట్‌ను పాసయ్యాడు.

ఇప్పుడు మేం అతన్ని డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయించాలనుకుంటున్నాం. ఏమవుతుందో చూడాలి. కానీ కోహ్లీ బౌలింగ్ విషయంలో అద్భుతం చేస్తాడని నేను కచ్చితంగా చెప్పగలను. కచ్చితమైన యార్కర్లతో రైట్ హ్యాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. కోహ్లీ బౌలింగ్ అద్భుతాలను మనమంతా చూడబోతున్నాం'అని పరాస్ మాంబ్రే చెప్పుకొచ్చాడు.

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో జట్టుకు దూరమవడంతో టీమిండియాకు ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. ఈ సమస్యను అధిగమించేందుకు టీమిండియా పార్ట్ టైమ్ బౌలర్లను ఉపయోగించుకోవాలనుకుంటోంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీతో పాటు రోహిత్, గిల్, సూర్య బౌలింగ్ చేశారు.

బుధవారం ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Monday, November 13, 2023, 21:49 [IST]
Other articles published on Nov 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+