Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: అరెస్ట్ భయం.. పారిపోయిన పాకిస్థాన్ ప్రజెంటర్!

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023 కోసం భారత్‌కు వచ్చిన స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్, పాకిస్థాన్ బ్యూటీ జైనాబ్ అబ్బాస్ హడావుడిగా స్వదేశం వెళ్లిపోయింది. సోషల్ మీడియా వేదికగా హిందువులను కించపరుస్తూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చిక్కుల్లో పడేసాయి. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ టీమ్ ఆడే మ్యాచ్‌లకు ప్రజెంటర్ వ్యవహరించేందుకు జైనాబ్ అబ్బాస్ భారత్‌కు వచ్చింది.

హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. తన అంద చందాలతో అభిమానులను ఆకట్టుకుంది. ఇంతలోనే ఆమె స్వదేశం పారిపోయినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె దుబాయ్‌లో ఉందని, అక్కడి నుంచి పాకిస్థాన్ వెళ్లనుందని ప్రచారం జరుగుతోంది.

World Cup 2023: Pakistan Presenter Zainab Abbas deported from India After Anti Hindu remarks

భారత దేశాన్ని, హిందూ మతాన్ని విమర్శిస్తూ ఆమె చేసిన పాత ట్వీట్‌లు బయట పడటంతో ఇండియన్ నెటిజన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినీత్ జిందాల్ అనే న్యాయవాది, సామాజిక వేత్త జైనాబ్ అబ్బాస్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు. సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వొకేట్ అయిన వినీత్ జిందాల్.. ఢిల్లీలోని సైబర్ సెల్ విభాగంలో ఐపీసీలోని 153 ఏ, 295, 506, 121, ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 67 కింద కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా ఐసీసీ స్పోర్ట్స్ ప్రజెంటర్స్ లిస్ట్ నుంచి ఆమె పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ అనూహ్య పరిణామాలతో అరెస్ట్ చేస్తారని భయపడిన జైనాబ్ అబ్బాస్.. భారత్‌ను విడిచి స్వదేశం వెళ్లిపోయింది. అయితే ఈ వ్యవహారంపై జైనాబ్ అబ్బాస్‌తో పాటు ఐసీసీ, హోస్ట్ బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకట చేయలేదు.

పాకిస్థాన్ నెటిజన్లు మాత్రం భారత్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆటలను రాజకీయాలతో ముడిపెడుతున్నారని, జైనాబ్ అబ్బాస్‌పై కేసులు పెట్టడం అన్యాయమని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Story first published: Monday, October 9, 2023, 17:09 [IST]
Other articles published on Oct 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+