World Cup 2023: పాకిస్థాన్ బౌలర్ల చెత్త రికార్డ్!
World Cup 2023, END vs PAK: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ పేసర్లు హ్యారీస్ రౌఫ్, షాహిన్ షా అఫ్రిది చెత్త రికార్డు నమోదు చేశారు. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లుగా నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి మ్యాచ్‌లో తేలిపోయిన పాకిస్థాన్ పేసర్లు.. అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లుగా అప్రతిష్టను మూటగట్టుకున్నారు.
మెగా టోర్నీకి ప్రారంభానికి ముందు పాకిస్థాన్ బౌలింగ్ భీకరంగా ఉందని, ఆ జట్టును ఎదుర్కోవడం కష్టమని ఊదరగొట్టిన మాజీ క్రికెటర్లు వారి పేలవ ప్రదర్శనను చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన హ్యారీస్ రౌఫ్ 533 పరుగులు సమర్పించుకొని అత్యధిక పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.

హ్యారీస్ రౌఫ్ తర్వాత శ్రీలంక పేసర్ మధుషంక 525 పరుగులు ఇచ్చి రెండో స్థానంలో నిలవగా.. 9 మ్యాచ్‌ల్లో 481 పరుగులిచ్చిన షాహిన్ షా అఫ్రిదీ మూడో స్థానంలో నిలిచాడు. ముజీబ్ రెహ్మాన్ 458 పరుగులివ్వగా.. 8 మ్యాచ్‌లు ఆడిన స్టార్క్ 439 పరుగులిచ్చుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్ల పేలవ ప్రదర్శనపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ బౌలర్లు తేలిపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్‌బాల్‌తో చెలరేగి భారీ స్కోర్ చేశారు. బెన్ స్టోక్స్(76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84), జో రూట్(72 బంతుల్లో 4 ఫోర్లతో 60), జానీ బెయిర్‌స్టో(61 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది.
హ్యారీస్ రౌఫ్(3/59) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది(2/72), మహమ్మద్ వాసీమ్(2/74) రెండేసి వికెట్లు పడగొట్టారు.. ఇఫ్తికర్ అహ్మద్(1/38)కు ఓ వికెట్ దక్కింది. ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ 8 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ ఓటమి దిశగా సాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications