PAK vs AFG: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. హద్దులు ధాటి అసభ్యకర ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. తాను చేసిన గలీజ్ పనితో పాకిస్థాన్‌కు కూడా చెడ్డ పేరు తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మ్యాచ్ సీరియస్‌గా జరుగుతుండగా.. స్టాండ్స్‌లో కూర్చున్న ఓ పాకిస్థాన్ అభిమాని.. దిల్ దిల్ పాకిస్థాన్ అని పాట పాడుతూ తన జట్టుకు మద్దతు తెలిపాడు. ఆ తర్వాత ఒక్కసారిగా మ్యాచ్‌కు హాజరైన ఇండియన్ మైనర్ గర్ల్స్ వైపు అసభ్యకర సైగలు చేస్తూ 'జాన్ జాన్ పాకిస్థాన్'అని పాట పాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా అభిమానులు మండిపడుతున్నారు.

భారత అభిమానుల ప్రవర్తను తప్పుబట్టిన జర్నలిస్ట్‌లు, మేధావులు ఇప్పుడు స్పందించరు ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఓ పాకిస్థాన్ అభిమానిని పోలీస్ అధికారి అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. తన జట్టుకు మద్దతు తెలపడం తప్పా అంటూ నెటిజన్లు, జర్నలిస్ట్‌లు ప్రశ్నించారు. బంగ్లాదేశ్ వీరా అభిమానిని గేలి చేసిన భారత అభిమానులపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ రెండు ఘటనలతో వన్డే ప్రపంచకప్ 2023లో ఇతర దేశాల అభిమానులకు స్వేచ్చ లేదనే విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా పాకిస్థాన్ అభిమాని చేసిన గలీజ్ పనిపై భారత అభిమానులు మండిపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన అఫ్గానిస్థాన్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. బాబర్ ఆజామ్(92 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 74), అబ్దుల్లా షఫీక్(75 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్(3/49) మూడు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్(2/52) రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ నబీ, అజ్మతుల్లాకు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 49 ఓవర్లలో2 వికెట్లకు 286 పరుగులు చేసి గెలుపొందింది. ఇబ్రహీమ్ జడ్రాన్(113 బంతుల్లో 10 ఫోర్లతో 87), రెహ్మానుల్లా గుర్బాజ్(53 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 65), రెహ్మత్ షా(84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.