హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఉప్పల్ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నానని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. అయితే పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది.
మ్యాట్ హెన్రీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(1) కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్(25 బ్యాటింగ్), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(14 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో పాకిస్థాన్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 33 పరుగులు చేశారు.

ఉప్పల్ వేదికగా ప్రేక్షకుల్లేకుండానే ఈ మ్యాచ్ జరుగుతోంది. ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్.. 2016లో చివరిసారిగా టీ20 ప్రపంచకప్ ఆడింది. వినాయక నిమజ్జనం ఉండటంతో భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. దాంతో ఈ మ్యాచ్‌ను ప్రేక్షకుల్లేకుండానే నిర్వహిస్తున్నారు.
అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్ జట్టు రెండు వామప్ మ్యాచ్‌లు.. రెండు ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్‌తో తొలి వామప్ మ్యాచ్ అనంతరం అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో రెండో వామప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్‌తో ప్రపంచకప్ మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. అక్టోబర్ 10న శ్రీలంకతో జరిగే రెండో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.