World Cup 2023: ఘోర పరాజయం.. ఏడాది పాటు వన్డేలకు పాకిస్థాన్ దూరం!
World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్.. దాదాపు ఏడాది పాటు వన్డేలకు దూరంగా ఉండనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరగనుండటంతో పూర్తిగా పొట్టి క్రికెట్‌పైనే ఫోకస్ పెట్టనుంది. టీ20 ప్రపంచకప్‌కు తోడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లు ఆడనుంది. వచ్చే ఏడాది నవంబర్ వరకు పాకిస్థాన్ వన్డేలు ఆడే పరిస్థితి లేదు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భవిష్యత్తు ప్రణాళికల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో 3 టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను జనవరిలో ఆడనుండగా.. ఫిబ్రవరి-మార్చిలో వెస్టిండీస్‌తో 2 టెస్ట్‌లు, 3 టీ20లు, మేలో నెదర్లాండ్స్‌తో 3 టీ20లు, ఐర్లాండ్‌తో 3 టీ20లు, ఇంగ్లండ్‌తో 4 టీ20లు, ఆగస్టు-సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో 2 టెస్ట్‌లు, అక్టోబర్‌లో ఇంగ్లండ్‌తో 3 టెస్ట్‌లు ఆడాల్సి ఉంది.

వచ్చే ఏడాది నవంబర్‌లో పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ జరగనుంది. అప్పటి వరకు పాకిస్థాన్ జట్టు కేవలం టీ20లు, టెస్ట్‌లు మాత్రమే ఆడనుంది.
భారీ అంచనాలతో వన్డే ప్రపంచకప్ 2023 బరిలోకి దిగిన పాకిస్థాన్ కనీసం సెమీస్ చేరకుండా ఇంటిదారిపట్టింది. 9 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచింది. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ ఆ జట్టు పతనాన్ని శాసించింది. జట్టులోని ఆటగాళ్ల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు సైతం టీమ్ పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపాయి.
ప్రపంచకప్ వైఫల్యంతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై వేటు పడే అవకాశం ఉంది. అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించి షాహిన్ షా అఫ్రిదికి జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications