World Cup 2023: ఘోర వైఫల్యం.. పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ రాజీనామా!
World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ జట్టులో ఊహించినట్లుగానే మార్పులు జరుగుతున్నాయి. పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఆ జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్(Morne Morkel) తన పదవికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది జూన్‌లోనే పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఈ సౌతాఫ్రికా దిగ్గజం.. తన కాంట్రాక్ట్‌కు ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ ముందుగానే తప్పుకున్నాడు.
ఆరు నెలల పాటు బౌలింగ్ కోచ్‌గా పనిచేసేందుకు పీసీబీతో మోర్కెల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ కాంట్రాక్ట్‌ను పొడిగించే అవకాశం కూడా ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ జట్టు పేలవ ప్రదర్శన.. పీసీబీ ఆర్థిక సమస్యలతో జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండటంతో మోర్కెలే స్వయంగా తప్పుకున్నాడు.

ఈ ఏడాది జూలైలో శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌తో మోర్కెల్ పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా తన పనని మొదలుపెట్టాడు. మోర్కెల్ రాజీనామాను పీసీబీ కూడా ధృవీకరించింది. ప్రస్తుతానికి అయితే అతని స్థానంలో మరెవర్నీ నియమించలేదు. పాకిస్థాన్ మాజీ పేసర్ ఉమర్ గుల్‌కు ఈ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది.
గతంలో పాకిస్థాన్ బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్ సేవలందించాడు. డిసెంబర్‌లో పాకిస్థాన్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 20 నుంచి ఈ సిరీస్‌కు సంబంధించిన ప్రాక్టీస్ క్యాంప్ పాకిస్థాన్‌లో ప్రారంభం కానుంది. ఆలోపు కొత్త బౌలింగ్ కోచ్‌ను నియమించే అవకాశం ఉంది.
భారీ అంచనాలతో వన్డే ప్రపంచకప్ 2023 బరిలోకి దిగిన పాకిస్థాన్ కనీసం సెమీస్ చేరకుండా ఇంటిదారిపట్టింది. 9 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచింది. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ ఆ జట్టు పతనాన్ని శాసించింది. జట్టులోని ఆటగాళ్ల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు సైతం టీమ్ పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications