Mohammed Shami: షమీకి బాలీవుడ్ నటి బంపరాఫర్.. అలా చేస్తే దానికి రెడీ!
Mohammed Shami, World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో సంచలన ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకీ బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ బంపరాఫర్ ఇచ్చింది. అతను ఇంగ్లీష్ మెరుగుపరుచుకుంటే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. ఈ మేరకు పాయల్ ఘోష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
'మహమ్మద్ షమీని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే అతను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలి'అని పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కగా.. ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు.

పెళ్లి చేసుకోవడానికి భాషతో వచ్చిన పనేంటని ప్రశిస్తున్నారు. ఇది షమీని అవమానించడమేనని ఒకరంటే.. విదేశాల్లో సంసారం చేద్దామనకుంటున్నట్లుందని మరొకరు సెటైర్లు పేల్చారు. ఈ ఆఫర్‌పై షమీ ఎలా స్పందిస్తాడో చూడాలని ఇంకొకరు కామెంట్ చేశారు. ఫేమస్ కావడం కోసం పాయల్ ఘోష్ ఆడిన డ్రామా అంటూ మరికొందరు తీసిపారేస్తున్నారు. ఏదేమైనా.. పాయల్ ఘోష్ ట్వీట్ చర్చనీయాంశమైంది.
బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలైన పాయల్ ఘోష్(Payal Ghosh).. పలు తెలుగు సినిమాల్లో కూడా నటించింది. మంచు మనోజ్ నటించిన 'ప్రయాణం'మూవీతో వెండితెరకు పరిచయమైన పాయల్.. 'ఊసరవెళ్లి' సినిమాలో తమన్నాకు ఫ్రెండ్‌గా నటించింది. అనంతరం బాలీవుడ్‌లో నటించిన ఆమె 2020లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్‌దాస్ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతోంది.

2014లో ఐపీఎల్ ఛీర్ గర్ల్ అయిన హసీన్ జహాన్‌ను మహమ్మద్ షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2015లో వీరికి ఓ పాప జన్మించింది. 2018, మార్చి 8న మహమ్మద్ షమీపై హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేయడంతో పాటు గృహ హింస కేసు పెట్టింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ వేరుగా ఉంటున్నారు.
హసీన్ జహాన్ కారణంగా షమీ.. తీవ్ర మానసిక క్షోభను అనుభవించాడు. ఈ విషయాన్ని అతనే వెల్లడించాడు. డిప్రెషన్ కారణంగా రెండు, మూడు సార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించినట్లు పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications