Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023లో అతను యువరాజ్‌సింగ్‌లా చెలరేగుతాడు: మహమ్మద్ కైఫ్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసల జల్లు కురిపించాడు. వన్డే ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా కీలకం కానున్నాడని జోస్యం చెప్పాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా యువరాజ్ సింగ్ పోషించిన పాత్రను తాజా ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా పోషిస్తాడని తెలిపాడు.

ఇక వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్‌‌తో మాట్లాడిన మహమ్మద్ కైఫ్.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

World Cup 2023

'ప్రాక్టీస్ సెషన్‌కు కూడా హార్దిక్ పాండ్యా ఓ ప్రణాళికతో వెళ్తాడు. ఏ విషయంపై వర్క్ చేయాలనే స్పష్టతతో నెట్ ప్రాక్టీస్ చేస్తాడు. బ్యాటింగ్ విషయంలోనూ ఇలానే ప్రిపేర్ అవుతాడు. చివరి 10 ఓవర్లలో ఎలా ఆడాలనేదానిపై కూడా ప్రాక్టీస్ చేస్తాడు. అతను ఎక్కువ స్ట్రైట్‌గా షాట్స్ ఆడుతుంటాడు. ఈ షాట్స్ చూస్తేనే అతను ఎంత పకడ్బందీ ప్రణాళికతో బ్యాటింగ్ చేస్తాడో అర్థమవుతోంది.

ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా 3, 4వ స్థానంలో బ్యాటింగ్ చేయడం చూశాం. కానీ భారత్ తరఫున నెంబర్ 6లో బ్యాటింగ్ చేస్తాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ పోషించిన పాత్రను తాజా ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా పోషించనున్నాడు. యువరాజ్ సింగ్ నెంబర్ 6‌లో బ్యాటింగ్‌కు వచ్చి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసాడు. బౌలింగ్‌లోనూ బంతితో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పుడు హార్దిక్ పాండ్యా కూడా అదే చేయబోతున్నాడు. బంతితో పాటు బ్యాట్‌తో సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నాడు. అతని నెట్‌ ప్రాక్టీస్ సెషన్‌ను పరిశీలించిన తర్వాతే ఈ మాట చెబుతున్నాను. అతను స్ట్రైట్‌గా, గ్రౌండ్ మధ్యలో ఫోర్లు, సిక్స్‌లు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతను తన గేమ్ ప్లాన్‌ను ఫాలో అవుతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా కీలకం కాబోతున్నాడు.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, October 7, 2023, 20:44 [IST]
Other articles published on Oct 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+