Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: నెదర్లాండ్స్‌తో వామప్ మ్యాచ్.. హ్యాట్రిక్ వికెట్ తీసిన మిచెల్ స్టార్క్

తిరువనంతపురం: వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో నెదర్లాండ్స్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ హ్యాట్రిక్ వికెట్లతో సత్తా చాటాడు. వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి నెదర్లాండ్స్‌ను కోలుకోలేని దెబ్బతీసాడు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ మాక్స్ ఓ డౌడ్(0), ఆరో బంతికి వెస్టీ బార్రెసీ(0)లను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు.

ఇక తన మరుసటి ఓవర్ తొలి బంతికి బాస్ డే లీడ్(0)ను కూడా స్టార్క్ పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్ ఘనత అందుకున్నాడు. ఈ మూడు వికెట్లలో రెండు క్లీన్ బౌల్డ్ ద్వారా రావడం విశేషం. తిరువనంతపురం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో అంపైర్లు ఆటను 23 ఓవర్లకు కుదించారు.

Mitchell Starc

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 23 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన స్టీవ్ స్మిత్(42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీతో రాణించగా.. అలెక్స్ క్యారీ(25 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28), కామెరూన్ గ్రీన్(26 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 34), మిచెల్ స్టార్క్(22 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 24) రాణించారు.

నెదర్లాండ్స్ బౌలర్లు లోగన్ వాన్ బీక్, రోయిలోఫ్, బాస్ డీ లీడ్ తలో రెండు వికెట్లు తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ మిచెల్ స్టార్క్ దెబ్బకు 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. కొలిన్ అకెర్‌మన్(23 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు.

భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన వామప్ వర్షం కారణంగా రద్దయ్యింది. టాస్ పడిన అనంతరం వర్షం రాగా.. ఎంతకు తగ్గకుపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

Story first published: Saturday, September 30, 2023, 22:27 [IST]
Other articles published on Sep 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+