Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఒక్క బంతికి 13 పరుగులు! (వీడియో)

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 న్యూజిలాండ్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఫస్ట్ మ్యాచ్‌లో పటిష్ట ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన కివీస్.. రెండో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. సోమవారం ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన న్యూజిలాండ్ 99 పరుగుల భారీ తేడాతో రెండో విజయాన్ని నమోదు చేసింది.

అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరి బంతికి 13 పరుగులు వచ్చాయి. నెదర్లాండ్స్ బౌలర్ బాస్ లి డే చేసిన తప్పిదం కివీస్‌కు కలిసొచ్చింది. చివర్లో 17 బంతుల్లో 36 పరుగులతో మెరుపులు మెరిపించిన మిచెల్ సాంట్నర్.. బాస్‌ల లిడేకు చుక్కలు చూపించాడు. ఆఖరి బంతికి రెండు సిక్స్‌లు బాది దిమ్మతిరిగే షాకిచ్చాడు.

World Cup 2023: Mitchell Santner Slams 13 Off 1 Ball Vs Netherlands Goes Viral

సాంట్నర్ తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. ఈ రెండు సిక్స్‌లు కూడా కివీస్ చివరి బంతికి రావడం విశేషం. నోబాల్ కారణంగా లభించిన ఫ్రీహిట్‌తో సిక్స్ బాది 13 పరుగులు పిండుకున్నాడు.

చివరి బంతిని బాస్ లిగే నోబాల్‌గా వేయగా సాంట్నర్ సిక్సర్ బాదాడు. దాంతో ఏడు పరుగులతో పాటు ఫ్రీహిట్ లభించింది. ఫ్రీహిట్‌ను కూడా సిక్స్ బాదడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం ఈ రెండు సిక్స్‌లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో శతక్కొట్టిన రచిన్ రవీంద్ర(51 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 51) హాఫ్ సెంచరీతో తన ఫామ్‌ను కొనసాగించగా.. విల్ యంగ్(80 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70), టామ్ లాథమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 53)లు కూడా హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

డెవాన్ కాన్వే(40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 32)తో పాటు మిచెల్ సాంట్నర్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్), డారిల్ మిచెల్(47 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్‌లతో 48) పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్, రోయిలోఫో వాన్ డెర్ మార్వె రెండేసి వికెట్లు తీయగా.. బాస్ డీ లీడే ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 223 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ సాంట్నర్(5/59) ఐదు వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించగా... మ్యాట్ హెన్రీ(3/59) మూడు వికెట్లతో సత్తా చాటాడు. రచిన్ రవీంద్రకు(1/46) ఓ వికెట్ దక్కింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో కొలిన్ అకర్‌మన్(73 బంతుల్లో 5 ఫోర్లతో 69) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.

Story first published: Monday, October 9, 2023, 22:32 [IST]
Other articles published on Oct 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+