Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: పరువు దక్కించుకున్న పాక్.. పసికూన ముందు పోరాడే లక్ష్యం!

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పసికూన నెదర్లాండ్స్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ 287 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్ పేసర్ల ధాటికి పాకిస్థాన్ టాపార్డర్ చేతులెత్తేయగా.. మిడిలార్డర్, లోయరార్డర్‌ ఆదుకోవడంతో పరువు దక్కించుకుంది.

మహమ్మద్ రిజ్వాన్(75 బంతుల్లో 8 ఫోర్లతో 68), సౌద్ షకీల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ నవాజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 39), షాదాబ్ ఖాన్(34 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

 Netherlands restrict Pakistan

నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడ్(4/62) నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. కొలిన్ అకెర్‌మన్(2/39) రెండు వికెట్లు తీసాడు. ఆర్యన్ దత్, లోగన్ వాన్ బీక్, పాల్ వాన్ మీకెరెన్ తలో వికెట్ తీసారు.

టాప్-3 విఫలం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. పవర్ ప్లేలోనే పాకిస్థాన్ టాప్-3 బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది. ఫకార్ జమాన్(12), బాబర్ ఆజామ్(5), ఇమామ్ ఉల్ హక్(15) వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో పాక్ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆదుకున్న రిజ్వాన్, షకీల్..
ఈ పరిస్థితుల్లో మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. ఈ క్రమంలో ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 120 పరుగులతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆర్యన్ దత్ విడదీసాడు.

సౌద్ షకీల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం బాస్ డీ లీడ్ ఒకే ఓవర్‌లో మమమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్‌లను పెవిలియన్ చేర్చి షాకిచ్చాడు. లీడ్ దెబ్బకు పాక్ 188 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి 200 పరుగుల్లోపే ఆలౌటయ్యే దిశగా కనిపించింది.

నవాజ్, షాదాబ్ సూపరో సూపర్..
కానీ మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ సూపర్ బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌ను ఆదుకున్నారు. ఓపికగా బ్యాటింగ్ చేసిన ఈ జోడీ ఏడో వికెట్‌కు 64 పరుగులు జోడించి పాక్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించారు. ఈ ఇద్దరితో పాటు హసన్ అలీ(0) ఔటైనా.. షాహిన్ షా అఫ్రిది(13 నాటౌట్), హ్యారీస్ రౌఫ్(16) విలువైన పరుగులు జోడించారు.

బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఉప్పల్ వికెట్‌పై ఈ లక్ష్యాన్ని చేధించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ షాహిన్ షా అఫ్రిది, హ్యారీస్ రౌఫ్ బౌలింగ్‌ను ఎలా ఆడుతారనేదానిపై నెదర్లాండ్స్ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Story first published: Friday, October 6, 2023, 17:49 [IST]
Other articles published on Oct 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+