For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: 'ఇదేందయ్యా ఇది.. నేను ఏడ చూడలే'.. అవార్డ్ కోసం లైటింగ్ షోనా..?(వీడియో)

IND vs ENG: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా 6వ మ్యాచ్‌లో గెలిచిన టీమిండియా పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 100 పరుగులతో గెలిచిన టీమిండియా.. మెగా టోర్నీలో తమకు తిరుగులేదని నిరూపించింది.

మెగా టోర్నీ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రవేశ పెట్టిన బెస్ట్ ఫీల్డర్ అవార్డు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ప్రతీ మ్యాచ్ అనంతరం మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ కనబర్చిన ఆటగాడికి ఈ అవార్డు కింద గోల్డ్ మెడల్ అందిస్తున్నారు. ఈ మెడల్‌ విన్నర్‌ను వినూత్న రీతిలో ప్రకటిస్తూ.. ఆటగాళ్లతో పాటు అభిమానులను అలరిస్తున్నారు.

World Cup 2023: LEDs displaying KL Rahuls jersey for his second Fielder of Match award in IND vs ENG

తొలి మూడు మ్యాచ్‌లకు సాధారణంగానే డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఈ అవార్డు విన్నర్‌ను ప్రకటించిన టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్( T Dilip) .. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో మాత్రం వినూత్నంగా ప్రకటించి ఈ అవార్డు విలువను డబుల్ చేశాడు.

మైదానంలోని స్క్రీన్ బోర్డుపై ఒకసారి.. స్పైడర్ కెమెరా సాయంతో రెండో సారి అవార్డు విన్నర్‌ను ప్రకటించాడు. తాజాగా మైదానంలోని ఫ్లడ్ లైట్స్ బంద్ చేసి లైటింగ్ షోతో బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ విన్నర్ పేరును వెల్లడించాడు.

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌(KL Rahul)కు ఈ అవార్డు వరించింది. ఈ టోర్నీలో రాహుల్‌కు ఈ అవార్డు రావడం రెండోసారి. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాహుల్‌కు ఈ అవార్డు వరిచింది. ఈ మెడల్‌ను రెండు సార్లు అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా రాహుల్ నిలిచాడు.

మెడల్ ప్రకటించే ముందు టీ దిలీప్ డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడాడు. 'గణంకాలను చూసి ఈ మెడల్ ఇవ్వడం లేదు. అలాగని ఓ అద్భుత క్యాచ్‌కో లేక పరుగులు ఆపినందుకో కూడా ఈ అవార్డు ఇవ్వడం లేదు. మైదానంలో అద్భుత ఫీల్డింగ్ చేస్తూ.. మ్యాచ్ మొత్తాన్ని ప్రభావం చేస్తున్న వారికి మాత్రమే ఈ అవార్డు అందిస్తున్నాం. ఈ రోజు ఇషాన్ కిషన్‌తో పాటు సిరాజ్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు.'అని టీ దిలీప్ చెప్పుకొచ్చాడు.

ఈ స్పీచ్ అనంతరం అందరూ డ్రెస్సింగ్ రూమ్ బాల్కనీలోకి రావాలని కోరాడు. ఈటగాళ్లందరూ రాగానే మైదానంలోని ఫ్లడ్ లైట్స్ బందయ్యాయి. చీకటిలో నుంచి కేఎల్ రాహుల్ జెర్సీ లైట్ షోతో కనిపించింది. దాంతో ఆటగాళ్లంతా గట్టిగా అరుస్తూ రాహుల్‌కు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ కాగా అభిమానులు ఫిదా అవుతున్నారు.

'ఇదేందయ్యా ఇది.. నేను ఏడ చూడలే'.. అవార్డ్ కోసం లైటింగ్ షోనా? అని కామెంట్ చేస్తున్నారు. దిలీప్ మామ మాములోడు కాదు.. అవార్డు కంటే సెలెబ్రేషన్స్‌తో రచ్చ చేస్తున్నాడని అభిప్రాయపడుతున్నారు.

Story first published: Monday, October 30, 2023, 16:17 [IST]
Other articles published on Oct 30, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+