Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: కుల్దీప్ యాదవ్ కళ్లు చెదిరే క్యాచ్.. పోలా అదిరిపోలా! (వీడియో)

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్.. సూపర్ క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌కు రషీద్ ఖాన్(16) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన 49వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా స్లోయర్‌గా వేయగా.. రషీద్ ఖాన్ ధాటిగా ఆడాడు. మిస్‌టైమ్ అయిన బంతి గాల్లోకి లేవగా.. స్వీపర్ కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ అద్భుతంగా అందుకున్నాడు. తొలుత క్యాచ్ చేజారాగా.. రెండో ప్రయత్నంలో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. ఈ సూపర్ క్యాచ్‌కు రషీద్ వెనుదిరిగడంతో అఫ్గాన్.. 10-20 పరుగులు తక్కువ చేసింది.

World Cup 2023: Kuldeep Yadav takes stunning catch to dismiss Rashid Khan

కుల్దీప్ యాదవ్ క్యాచ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 8 వికెట్లకు 272 పరుగులే చేసింది. హష్మతుల్లా షాహిది(88 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 80), అజ్మతుల్లా ఓమర్జీ(69 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) హాఫ్ సెంచరీలతో రాణించారు. జస్‌ప్రీత్ బుమ్రా(4/34) అఫ్గాన్ పతనాన్ని శాసించారు. హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌కు తలో వికెట్ దక్కింది.

Story first published: Wednesday, October 11, 2023, 18:28 [IST]
Other articles published on Oct 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+