Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: హైదరాబాద్‌లో రీఎంట్రీ.. దుమ్మురేపిన కేన్ మామ!

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ తనకు అచ్చొచ్చిన హైదరాబాద్ గడ్డపై దుమ్మురేపాడు. మోకాలి గాయం కారణంగా సుమారు 6 నెలల పాటు ఆటకు దూరమైన కేన్ మామ.. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు.

ఉప్పల్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేన్ మామ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 50 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సుదీర్ఘ కాలం ఆడిన కేన్ మామకు ఉప్పల్ మైదానం సొంత గ్రౌండ్‌లానే. ఈ అనుభవంతోనే కేన్ మామ పాకిస్థాన్‌పై క్లాస్ ఇన్నింగ్స్ చూపించాడు.

 Kane Williamson

సెంచరీ చేసేలా కనిపించిన అతన్ని ముందస్తు ఫిట్‌నెస్ చర్యల్లో భాగంగా వెనక్కు పిలిపించారు. వన్డే ప్రపంచకప్ ముందు కేన్ మామ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగిన కేన్ మామ.. తొలి మ్యాచ్‌లోనే ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే క్రమంలోనే అతని మోకాలికి బలమైన గాయమైంది. దాంతో శస్త్ర చికిత్స చేసుకోవాల్సి వచ్చింది.

వామప్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 103) సెంచరీ బాదగా.. బాబర్ ఆజామ్(84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80), సౌద్ షకీల్(53 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్, లూకీ ఫెర్గూసన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్.. విజయం దిశగా సాగుతోంది. ఓపెనర్ డెవాన్ కాన్వే(0) విఫలమైనా.. ఓపెనర్ రచిన్ రవీంద్ర(72 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 97) సూపర్ బ్యాటింగ్‌తో రాణించాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. కేన్ విలియమ్సన్(50 బంతుల్లో 8 ఫోర్లతో 54), డారిల్ మిచెల్(57 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఉసామ మిర్ రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ, అఘా సల్మాన్ తలో వికెట్ తీసారు.

Story first published: Friday, September 29, 2023, 22:08 [IST]
Other articles published on Sep 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+