Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: సిక్సర్‌తో మొదలుపెట్టిన జానీ భాయ్!

అహ్మదాబాద్: క్రికెట్ అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్‌కు తెరలేచింది. వరల్డ్ బిగ్గెస్ట్ నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ధాటిగా తమ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగగా.. ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్ వేసాడు.

అయితే ఫస్ట్ ఓవర్ రెండో బంతినే బెయిర్ స్టో సిక్సర్‌గా మలిచి తన దూకుడు చూపెట్టాడు. వన్డే ప్రపంచకప్ 2023ని సిక్సర్‌తో ప్రారంభించాడు.అనంతరం మరో బౌండరీ బాదిన బెయిర్ స్టో తొలి ఓవర్‌లోనే 12 పరుగులు పిండుకున్నాడు. బెయిర్ స్టో సిక్సర్‌కు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ బెన్ స్టోక్స్ ఫిదా అయ్యాడు. తొంటి గాయంతో అతను ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. డగౌట్‌లో కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నాడు.

Jonny Bairstow

ఇక బెయిర్ స్టో దూకుడుకు ఫ్యాన్స్ సైతం అవాక్కవుతున్నారు. వన్డేల్లో కూడా ఇంగ్లండ్ బజ్ బాల్ గేమ్ మొదలుపెట్టిందా? అని ప్రశ్నిస్తున్నారు. బెయిర్ స్టో దూకుడుగా ఆడినా.. డేవిడ్ మలాన్ ఇబ్బంది పడ్డాడు మిచెల్ సాంట్నర్ బౌలింగ్2లో అతనికి లైఫ్ వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మ్యాన్ హెన్రీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

క్రీజులోకి వచ్చిన జోరూట్‌తో బెయిర్ స్టో తన దూకుడును కొనసాగిస్తున్నాడు. దాంతో ఇంగ్లండ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ప్రపంచకప్ ట్రోఫీని మైదానంలోకి పట్టుకొచ్చాడు.

Story first published: Thursday, October 5, 2023, 15:07 [IST]
Other articles published on Oct 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+