Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఏం గుండెరా అది.. బౌల్డ్ బౌలింగ్‌లో రివర్స్ స్కూప్‌ సిక్సరా..?

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్- న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో దూకుడుగా ఆడుతోంది. ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో.. సిక్సర్‌తో మెగాటోర్నీని ప్రారంభించగా.. జోరూట్(Joe Root) రివర్స్ స్కూప్ సిక్సర్‌తో అభిమానులను అలరించాడు.

అది కూడా న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో రిస్క్ చేస్తూ రివర్స్ స్కూప్ ఆడటం అందర్నీ ఆకట్టుకుంది. ట్రెంట్ బౌల్డ్ వేసిన 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని బౌల్డ్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. ముందుగా నే రివర్స్ స్కూప్ పొజిషన్‌లోకి వచ్చిన జోరూట్.. బంతిని కీపర్‌ మీదుగా సిక్సర్ తరలించాడు.

 Joe Root

ఈ షాట్‌ను చూసిన బౌలర్ ట్రెంట్ బౌల్ట్‌తో పాటు న్యూజిలాండ్ ఆటగాళ్లు, కామెంటేటర్లు అవాక్కయ్యారు. టీవీల్లో చూసిన ప్రేక్షకులు సైతం జోరూట్ షాట్‌ను మెచ్చుకుంటున్నారు. నెటిజన్లు అయితే ఏం గుండెరా అది.. బౌల్డ్ బౌలింగ్‌లోనే రివర్స్ స్కూప్ షాటా? అని సెటైర్లు పేల్చుతున్నారు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన జోరూట్ (Joe Root).. మెక్‌కల్లమ్ టెస్ట్ టీమ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ధాటిగా ఆడుతున్నాడు. తాను కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేయగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ బజ్ బాల్ బ్యాటింగ్‌తో పరుగులు రాబడుతున్నాడు.

ఓపెనర్ డేవిడ్ మలాన్(14) విఫలమైనా.. జానీ బెయిర్ స్టో(35 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) మెరుపులు మెరిపించాడు. అయితే సాంట్నర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్(16 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 25) ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. రచిన్ రవీంద్ర బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

దాంతో ఇంగ్లండ్ 94 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా.. జోరూట్(29 బ్యాటింగ్), మొయిన్ అలీ(8 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Story first published: Thursday, October 5, 2023, 15:39 [IST]
Other articles published on Oct 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+