For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: మైదానంలోకి దూసుకొచ్చిన ప్రాంక్‌స్టార్ జార్వో.. కోహ్లీ నచ్చ చెప్పడంతో.!

చెన్నై: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బ్రిటన్ ఫేమస్ ప్రాంక్ స్టార్, యూట్యూబర్ జార్వో అలియాస్ డేనియెల్‌ జార్విస్‌ మైదానంలోకి దూసుకొచ్చాడు. టీమిండియా జెర్సీ ధరించి బౌలింగ్ చేస్తానంటూ రచ్చ చేశాడు. విరాట్ కోహ్లీ సర్ది చెప్పడంతో మైదానాన్ని వీడాడు.

జార్వో మామ కారణంగా కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. బ్యాటింగ్ ఎంచుకోగా టీమిండియా ఫీల్డింగ్‌కు దిగింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే జార్వో సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. అతని ఎంట్రీతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది.. జార్వోను బయటకు లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అతను వినకపోవడంతో.. విరాట్ కోహ్లీ అతనికి నచ్చజెప్పాడు.

 World Cup 2023: Jarvo Invades Chennai Pitch, Virat Kohli escorts him

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక జ్వారో ఇలా మైదానంలోకి దూసుకురావడం ఇదే తొలిసారి కాదు. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఆడిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లోనూ జ్వారో ఇలానే మైదానంలోకి దూసుకొచ్చాడు. వరుసగా మూడు టెస్ట్‌ల్లోనూ టీమిండియా జెర్సీని ధరించి బౌలింగ్ చేస్తానని.. బ్యాట్, హెల్మెట్, ప్యాడ్స్‌తో బరిలోకి బ్యాటింగ్ చేస్తానని రచ్చ చేశాడు.

పదే పదే మ్యాచ్‌లకు అంతరాయం కలిగించడంతో యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అతనిపై నిషేధం విధించింది. ఇక భారత జట్టు అంటే తనకు ఇష్టమని జ్వారో గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 'స్వతహాగా నేను టీమిండియాకు వీరాభిమానిని. లార్డ్స్‌ టెస్టు సమయంలో భారత ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సెషన్‌లో బిజీగా ఉన్నారు. ఇంగ్లండ్‌ జట్టుతో పోలిస్తే.. టీమిండియా ఆటగాళ్లు అభిమానులతో ఎక్కువగా ఇంటరాక్ట్‌ అవుతారని తెలసుకున్నా.

వారితో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఈ దారిని ఎంచుకున్నా. ఈ నేపథ్యంలోనే లార్డ్స్‌ టెస్టులో టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాను. ఒక విధంగా ఫ్రాంక్‌ చేసే అవకాశం వచ్చిందని భావించా. టీమిండియా ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం మాత్రం రాలేదు. అందుకే మూడో టెస్టులో ఏకంగా బ్యాట్‌, ప్యాడ్స్‌తో మైదానంలోకి వచ్చేశా అని తెలిపాడు.

నా బ్యాటింగ్‌కు భయపడి ఇంగ్లండ్‌ జట్టు నా పై జీవితకాల నిషేధం విధించిందేమో(నవ్వుతూ). అయినా మరోసారి ఇలా చేయకపోవచ్చు.'అని అప్పట్లో జ్వారో చెప్పుకొచ్చాడు.

ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ మిచెల్ మార్ష్(0).. విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌తో కలిసి వార్నర్ చెలరేగుతున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అతనికి ఓ లైఫ్ లభించింది. వార్నర్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను హార్దిక్ అందుకోలేకపోయాడు.

Story first published: Sunday, October 8, 2023, 15:11 [IST]
Other articles published on Oct 8, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+