Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: బంగ్లా అంటే రెచ్చిపోయే హిట్‌మ్యాన్.. అదే జోరు కొనసాగిస్తాడా?

వరల్డ్ కప్ అంటే చాలు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పూనకం వచ్చేస్తుంది. అప్పటి వరకు పెద్దగా ఫామ్‌లో లేకపోయినా కూడా.. వరల్డ్ కప్‌లో దుమ్ముదులిపేస్తాడు. అందుకే ఈ ఏడాది మెగాటోర్నీలో కూడా రోహితే డేంజరస్ బ్యాటర్ అని చాలా మంది మాజీలు చెప్తూ వచ్చారు. ఆ పేరు నిలబెట్టుకున్న రోహిత్.. ఆడిన మూడు మ్యాచుల్లోనే ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

ఆసీస్‌పై ఖాతా తెరవకుండానే అవుటైన రోహిత్ శర్మ.. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై ధనాధన్ ఆటతో భారీ శతకం సాధించాడు. ఇక పాకిస్తాన్‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో ఆడేందుకు రెడీ అవుతున్నాడు హిట్‌మ్యాన్. ఇక్కడే ఒక విషయం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు రెండు వన్డే వరల్డ్ కప్‌లు ఆడిన రోహిత్.. బంగ్లాను రెండుసార్లు ఎదుర్కొన్నాడు.

World Cup 2023 INDvsBAN Will Rohit continue his great form against Bangladesh

2011 వరల్డ్ కప్‌లో రోహిత్ ఆడలేదనే సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో కూడా రోహిత్ పెద్దగా రాణించలేదు. ఆ టోర్నీ మొత్తమ్మీద ఒకే ఒక్క సెంచరీ బాదాడు. అది కూడా బంగ్లాదేశ్ మీదనే కావడం గమనార్హం. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఆ మ్యాచులో 126 బంతుల్లో 137 పరగులు చేశాడు హిట్‌మ్యాన్. ఇక మిగతా మ్యాచుల్లో రోహిత్ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు.

ఇక 2019లో ఏకంగా ఐదు సెంచరీలు బాదాడీ స్టార్ బ్యాటర్. వీటిలో ఒకటి మళ్లీ బంగ్లాదేశ్ మీదనే చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో 92 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 104 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా వరల్డ్ కప్‌లలో బంగ్లాపై 241 పరుగులు చేశాడు. భారత్ తరఫున వరల్డ్ కప్‌లలో బంగ్లాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు. మరి పూణేలో కూడా రోహిత్ అదే జోరు చూపిస్తే.. బంగ్లాపై చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది.

Story first published: Thursday, October 19, 2023, 12:34 [IST]
Other articles published on Oct 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+