World Cup 2023: అఫిషియల్స్‌ను ప్రకటించిన ఐసీసీ.. జాబితాలో దరిద్రపుగొట్టు అంపైర్!
దుబాయ్: వన్డే ప్రపంచకప్ 2023 సంబంధించిన మ్యాచ్ అఫిషియల్స్ జాబితాను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. మెగా టోర్నీకి మొత్తం 16 మంది అంపైర్లను ఎంపిక చేసిన ఐసీసీ ఆ వివరాలను శుక్రవారం వెల్లడించింది. మెగా టోర్నీ కోసం ఐసీసీ ప్యానెల్‌లోని బెస్ట్ అంపైర్లను తీసుకుంది.
ఈ జాబితాలో భారత్ నుంచి నితిన్ మీనన్‌కు మాత్రమే అవకాశం దక్కింది. నితీన్ మీనన్‌తో పాటు క్రిస్ బ్రౌన్, కుమార ధర్మసేన, మరైస్ ఎరస్మాస్, క్రిస్ గాఫనే, మైకేల్ గాఫ్, అడ్రియన్ హోల్డ్ స్టాక్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్ బరో, అహ్‌సన్ రజా, పాల్ రిఫెల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షెయిద్, రాడ్ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయిల్ విల్సన్, పాల్స్ విల్సన్‌లు అవకాశం అందుకున్నారు.

జాబితాలో ఐరెన్ లెగ్ అంపైర్..:ఈ 16 మంది మెగా టోర్నీలో ప్రధాన అంపైర్లుగా, టీవీ అంపైర్‌గా, ఫోర్త్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఐసీసీ ప్రకటించిన ఈ అఫిషియల్స్ జాబితాలో రిచర్డ్ కెటిల్ బరో పేరు చూసి భారత అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఎందుకంటే రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడింది. దాంతోనే అతన్ని అంపైర్‌గా తీసుకోవద్దని ఇండియన్ ఫ్యాన్స్ ఐసీసీకి రిక్వెస్ట్ చేశారు. 2014 టీ20 ప్రపంచకప్ నుంచి 2022 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేసిన ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ ఓటమిపాలైంది.
2014 ప్రపంచకప్ నుంచి..:బంగ్లాదేశ్ వేదికగా జరిగిన 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేయగా.. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు శ్రీలంక చేతిలో 6 వికెట్లతో ఓటమిపాలైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2015 వన్డే వరల్డ్ కప్‌లోనూ భారత్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 95 పరుగులతో చిత్తుగా ఓడి ఇంటిదారిపట్టింది. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. టోర్నీ ఆసాంతం దూకుడుగా ఆడిన టీమిండియా.. సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిపాలైంది. ఇక 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ ఇదే సెంటిమెంట్ రిపీట్ అయింది.
పాక్ చేతిలో ఓటమి..:కెటిల్ బరో ఐరెన్ లెగ్ అంపైరింగ్ పుణ్యమా.. ఐసీసీ ఈవెంట్లో పాక్ చేతిలో ఎన్నడూ ఓడని కోహ్లీసేన చాంపియన్ ట్రోఫీ ఫైనల్లో 180 పరుగులతో ఓడి టైటిల్ చేజార్చుకుంది. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లోనూ న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ధోనీ రనౌట్ అయినప్పుడు లెగ్ అంపైర్‌గా ఉన్న కెటిల్ బరో.. 'అయ్యో' అని ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ను భారత అభిమానులు ఇంకా మరిచిపోలేదు.
డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ..:2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో టీవీ అంపైర్‌గా ఉండగా.. న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రిచర్డ్ కెటిల్ బరో టీవీ అంపైర్‌గా వ్యవహరించగా. ఆసీస్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే కెటిల్‌బరోను భారత అభిమానులు ఐరెన్ లెగ్ అంపైర్‌గా విమర్శిస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications