Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: టీమిండియా‌కు పవర్‌ఫుల్ బౌలింగ్.. ప్రత్యర్థులకు దబిడి దిబిడే!

హైదరాబాద్: క్రికెట్ అత్యున్నత టోర్నీ వన్డే ప్రపంచకప్‌కు తెరలేచింది. అహ్మదాబాద్‌లోని నరేద్రమోదీ స్టేడియం వేదికగా గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. ఇక 12 ఏళ్ల తర్వాత భారత గడ్డపై మెగా టోర్నీ జరుగుతుండగా.. టీమిండియా హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో రోహిత్ సేన తొలి మ్యాచ్ ఆడనుంది.

భీకర బౌలింగ్..
టోర్నీ సమయం దగ్గరపడుతున్నా కొద్దీ టీమిండియాకు అన్నీ సానుకూలంగా మారాయి. గాయాల బారిన పడిన కీలక ఆటగాళ్లు పూర్తిగా కోలుకొని ఫామ్ అందుకున్నారు. సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లు మంచి లయలో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా బలమైన బౌలింగ్ లైనప్ టీమిండియాకు ఉంది. ముఖ్యంగా పేస్ అటాక్ భీకరంగా ఉండి ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది.

World Cup 2023: India have strong bowling attack that opponents will find difficult to match

హడలెత్తిస్తున్న పేసర్లు..
వెన్ను గాయం నుంచి కోలుకున్న జస్‌ప్రీత్ బుమ్రా.. తన బౌలింగ్‌తో హడలెత్తిస్తుండగా.. మహమ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ జట్టుకు శుభారంభం అందిస్తున్నాడు. మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్‌లు కూడా రాణిస్తూ కీలకంగా మారారు. స్పిన్ బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా సత్తా చాటుతుండగా.. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేరికతో స్పిన్ విభాగం మరింత బలంగా మారింది.

Mohammed Siraj

సిరాజ్ సూపరో సూపర్..
స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌లపై పేసర్లు వికెట్లు తీయడం చాలా కష్టం. ఇక్కడ బౌన్స్, సీమ్ రాబట్టడం కత్తి మీద సామే. హజెల్ వుడ్ వంటి నాణ్యమైన పేసర్ కూడా ఇక్కడ వికెట్లు తీయలేక చేతులెత్తేసాడు. కానీ భారత పేసర్లు నిలకడగా వికెట్లు తీస్తున్నారు. ఇప్పటికీ 24 వన్డేలు ఆడిన మహమ్మద్ సిరాజ్ 43 వికెట్లు తీయగా.. ఇందులో ఉపఖండ పిచ్‌లపై ఆడిన 17 మ్యాచ్‌ల్లోనే 35 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 4.5 కావడం విశేషం.

 Mohammed Shami Bowling

సూపర్ ఫామ్‌లో షమీ..
ఇక మహమ్మద్ షమీ కెరీర్‌లో 162 వికెట్లలో 64 వికెట్లు ఆసియా గడ్డపై తీసినవే కావడం విశేషం. బుమ్రా కూడా 37 మ్యాచ్‌ల్లో 4.65 ఎకానమీతో 63 వికెట్లు తీసాడు. గొప్ప బౌలర్లుగా ప్రశంసలు అందుకుంటున్న పాకిస్థాన్ పేసర్లు షాహిన్ అఫ్రిదీ, హారిస్ రౌఫ్‌లకు కూడా ఆసియా పిచ్‌లపై గొప్ప రికార్డు లేదు. ముఖ్యంగా సిరాజ్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. సిరాజ్‌తో పాటు ఇతర బౌలర్లు కూడా ప్రత్యర్థి జట్ల ఓపెనర్లను క్రీజులో కుదురుకోనివ్వడం లేదు.

పవర్ ప్లేలోనే వికెట్లు..
2022 నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఆడిన 42 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 80 వికెట్లను పవర్ ప్లేలోనే సాధించారు. పవర్ ప్లేలో 132 ఓవర్లు వేసిన సిరాజ్ 4.16 ఎకానమీతో 32 వికెట్లు తీసాడు. ఈ ఏడాది 13 ఇన్నింగ్స్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. ఆసియాకప్ ఫైనల్లో అయితే సిరాజ్ డ్రీమ్ స్పెల్ వేసాడు.

మహమ్మద్ షమీ సైతం సూపర్ ఫామ్‌‌లో ఉన్నాడు. ఈ ఏడాది అతను 12 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి 19 వికెట్లు పడగొట్టాడు. గత ప్రపంచకప్‌లోనూ షమీ అద్భుత గణంకాలు నమోదు చేశాడు. 2015, 2019 ప్రపంచకప్‌ల్లో మొత్తం 11 మ్యాచ్‌ల్లో 31 వికెట్లు తీసాడు. వరల్డ్ కప్‌లో అతని బెస్ట్ 5/69 కాగా.. యావరేజ్ 15.70.

గాయంతో ఏడాది పాటు జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా.. పాకిస్థాన్‌తో వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది ఐదు మ్యాచ్‌లే ఆడిన బుమ్రా.. 8 వికెట్లు తీసాడు. ప్రపంచకప్‌లోనూ అతనికి మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు 9 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసాడు. అచ్చొచ్చిన స్పిన్ పిచ్‌లపై భారత స్పిన్నర్లు ఎలా చెలరేగుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Story first published: Thursday, October 5, 2023, 17:09 [IST]
Other articles published on Oct 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+