World Cup 2023: న్యూజిలాండ్‌తో సెమీస్.. టీమిండియాను కలవరపెడుతున్న రికార్డ్స్!
World Cup 2023, IND vs NZ Semi Final: వన్డే ప్రపంచకప్ 2023లో జోరుమీదున్న టీమిండియా మరో కీలక పోరుకు సిద్దమైంది. వరుస విజయాలతో లీగ్ దశను అజేయంగా ముగించిన రోహిత్ సేన బుధవారం న్యూజిలాండ్‌తో జరగనున్న సెమీఫైనల్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. ముంబైలోని వాంఖడే మైదానం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది.
ఓటమెరుగని జట్టుగా సెమీఫైనల్ చేరిన టీమిండియా.. 2003, 2007 వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో టైటిల్ అందుకున్న ఆస్ట్రేలియా తరహాలో ఛాంపియన్‌గా నిలవాలనుకుంటోంది. రోహిత్ శర్మ అసాధారణ కెప్టెన్సీ టీమిండియా ప్రధాన బలంగా మారింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ సూపర్ బ్యాటింగ్‌తో సత్తా చాటడం, బౌలింగ్‌లో బుమ్రా, షమీ, కుల్దీప్ నిప్పులు చెరగడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.

లీగ్ దశ మాదిరి టీమిండియా సమష్టిగా చెలరేగితే సెమీస్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించడం అత్యంత సులువు. హోమ్ గ్రౌండ్‌లో సొంత అభిమానుల మధ్య ఈ మ్యాచ్ జరగనుండటం కూడా టీమిండియాకు అడ్వాంటేజ్.
అయితే ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్ల ముఖా ముఖి పోరు చూస్తేనే అభిమానులకు ఆందోళన కలుగుతోంది. ఇప్పటి వరకు ఇరు జట్లు ఐసీసీ టోర్నీల్లో 13 సార్లు తలపడగా.. ఇండియా 4 విజయాలు మాత్రమే సాధించింది. ఇందులో తాజా టోర్నీ విజయం కూడా ఒకటి ఉంది. లీగ్ దశలో ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా.. న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది.
ఇక 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియాకు ఎదురైన పరాభావాన్ని భారత అభిమానులు మరిచిపోలేరు. ఆ టోర్నీలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. కీలక సెమీస్ పోరులో 240 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. వర్షం కారణంగా రెండో రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ రనౌటైన ఘటన ఇప్పటికీ అభిమానుల కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది.

భారత్-న్యూజిలాండ్ ముఖాముఖి పోరు
1975 ప్రపంచకప్: మాంచెస్టర్‌లో 4 వికెట్లతో టీమిండియా ఓటమి
1979 ప్రపంచకప్: లీడ్స్‌లో 8 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి
1987 ప్రపంచకప్: బెంగళూరులో 16 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు
1987 ప్రపంచకప్: నాగ్‌పూర్‌లో 9 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
1992 ప్రపంచకప్: దునెదిన్‌లో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి
1999 ప్రపంచకప్: నాటింగ్‌హోమ్‌లో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి
2000 ఛాంపియన్స్ ట్రోఫీ: నైరోబి వేదికగా జరిగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి
2003 ప్రపంచకప్: సెంచూరియన్‌లో 7 వికెట్లతో ఓడిన టీమిండియా
2007 టీ20 ప్రపంచకప్: జోహన్నెస్‌బర్గ్‌లో 10 పరుగులతో టీమిండియా ఓటమి
2016 టీ20 ప్రపంచకప్: నాగ్‌పూర్‌లో 47 రన్స్‌తో టీమిండియా ఓటమి
2019 ప్రపంచకప్: ఫలితం లేదు
2019 ప్రపంచకప్: మాంచెస్టర్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో 18 పరుగులతో ఓడిన టీమిండియా
2021 టీ20 ప్రపంచకప్: దుబాయ్‌లో 8 వికెట్లతో ఓడిన టీమిండియా
2023 ప్రపంచకప్: ధర్మశాల్లో 4 వికెట్లతో గెలిచిన టీమిండియా
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications