దుబాయ్: వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.. పిచ్ క్యూరేటర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో టాస్, డ్యూ ప్రభావం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా బౌండరీలన్నీ పెద్దగా ఉండాలని, పిచ్ కూడా స్పిన్నర్లతో పాటు పేసర్లకు అనుకూలించేలా తయారు చేయాలని ఆదేశించింది.
బ్యాట్, బాల్ మధ్య సమపోటీ ఉండేలా మైదానాలను సిద్దం చేయాలని సూచించింది. అందుకోసం పిచ్‌లపై ఎక్కువ గడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రతీ స్టేడియం బౌండరీలు 70 మీటర్ల కంటే ఎక్కువగానే ఉండాలని ఆదేశించింది. గత టోర్నీల అనుభవం నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది.

భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. మ్యాచ్‌లన్నీ డేనైట్ మోడ్‌లో జరుగనుండటంతో డ్యూ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అప్పుడు టాస్ కీలకం కానుంది. టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచేలా పరిస్థితులు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఐసీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.
మ్యాచ్‌లన్నీ రసవత్తరంగా సాగేలా.. పరిస్థితుల ప్రభావం ఆటపై లేకుండా ఉండేలా మైదానాలతో పాటు పిచ్‌లను సిద్దం చేయాలని పేర్కొంది. మొత్తం 10 జట్ల మధ్య 48 మ్యాచ్‌లు జరగనుండగా.. దేశవ్యాప్తంగా 12 వేదికలు ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
అక్టోబర్ 5న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లోనే వరల్డ్ బిగ్గెస్ట్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ప్రపంచకప్‌కు తెరలేవనుంది. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
నవంబర్ 15న ముంబై వేదికగా తొలి సెమీఫైనల్, నవంబర్ 16న కోల్‌కతా వేదికగా రెండో సెమీ ఫైనల్, నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా మూడో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.