న్యూఢిల్లీ: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కిది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మాస్టర్ బ్లాస్టర్‌ను వరల్డ్ కప్ 2023 గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. భారత్ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి సచిన్ టెండూల్కర్‌ను గ్లోబల్ ప్రచారకర్తగా ఎంపిక చేశామని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
గ్లోబల్ అంబాసిడర్ హోదాలో సచిన్ టెండూల్కర్.. వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరై.. ట్రోఫీతో మైదానంలోకి వచ్చి టోర్నీని అధికారికంగా ప్రారంభిస్తాడు.
గతంలో ఐసీసీ ప్రకటించిన ప్రపంచకప్ ఐసీసీ అంబాసిడర్ల జాబితాలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్, శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్, టీమిండియా స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా, భారత మహిళల క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, పాక్ ఆల్‌రౌండ్ మొహమ్మద్ హాఫీజ్‌లు ఉన్నారు.

అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపైన్‌ను షురూ చేయనుంది.
అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదీ పాకిస్థాన్‌తో మెగా మ్యాచ్ ఆడనుంది. అయితే మెగా టోర్నీకి సన్నాహక మ్యాచ్‌లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది. టీమిండియా ఆడాల్సిన రెండు వామప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా బంతి పడకుండానే రద్దయ్యాయి.