For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: బంగ్లాదేశ్‌పై విజయం.. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే?

Pakistan semi final chances: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ మూడో విజయాన్నందుకుంది. వరుసగా నాలుగు పరాజయాల తర్వాత తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. మంగళవారం బంగ్లాదేశ్‌తో ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మహ్మదుల్లా(70 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. లిటన్ దాస్(64 బంతుల్లో 6 ఫోర్లతో 45), షకీబ్ అల్ హసన్(64 బంతుల్లో 4 ఫోర్లతో 43) పర్వాలేదనిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, మహమ్మద్ వసీమ్‌ మూడేసి వికెట్లు తీయగా.. ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ తలో వికెట్ పడగొట్టారు.

 World Cup 2023: How Can Pakistan Reach Semi-Final After Big Win against Bangladesh

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 32.3 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసి 105 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68), ఫకార్ జమాన్(74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీహసన్ మీరాజ్(3/60) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.

సెమీస్ చేరాంటే..?
ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో అఫ్గాన్‌ను వెనక్కినెట్టి ఐదో స్థానానికి చేరిన పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. తాజా విజయంతో పాకిస్థాన్ ఖాతాలో 6 పాయింట్లు చేరాయి. పాకిస్థాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి పటిష్ట టీమ్స్‌తో ఆ జట్టు తలపడాల్సి ఉంది.

ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ విజయం సాధిస్తే ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు చేరుతాయి. ఈ 10 పాయింట్లతో పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. నాలుగేసి విజయాలు.. 8 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో మూడు, నాలుగో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తమ తదుపరి మూడు మ్యాచ్‌ల్లో మూడు ఓడిపోవాలి.

అలాగే మూడు విజయాలు, 6 పాయింట్లతో ఆరోస్థానంలో ఉన్న అఫ్గానిస్థాన్ కూడా తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ కంటే ఎక్కువ గెలవకూడదు. అప్పుడు ఈ మూడు జట్లు 8 పాయింట్లతో ఉంటే పాకిస్థాన్ 10 పాయింట్లతో టోర్నీలో ముందడుగు వేయగలదు.

అలాకాకుండా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఒక్కో మ్యాచ్ గెలిచి 10 పాయింట్లు సాధించి పాకిస్థాన్‌తో సమంగా నిలిస్తే రన్‌రేట్ కీలకం అవుతుంది. మెరుగైన రన్ ‌రేట్ ఉన్న జట్టు టోర్నీలో ముందడుగు వేస్తోంది. కాబట్టి పాకిస్థాన్ చివరి రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో గెలవాలి. ఇది జరగడం అసాధ్యం. అద్భుతం జరిగితే తప్పా పాకిస్థాన్ సెమీస్ చేరలేదు.

Story first published: Tuesday, October 31, 2023, 22:27 [IST]
Other articles published on Oct 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+