Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: అఫ్గానిస్థాన్ సెమీస్ చేరాలంటే..?

World Cup 2023‌లో పసికూన అఫ్గానిస్థాన్ సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. మాజీ చాంపియన్లను మట్టికరిపించిన అఫ్గానిస్థాన్.. సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ చేతిలో ఓడిన అఫ్గానిస్థాన్.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, మాజీ ఛాంపియన్ పాకిస్థాన్, శ్రీలంకను మట్టికరిపించింది.

ఇప్పటి వరకు 6 మ్యాచ్‌లు ఆడిన అఫ్గానిస్థాన్ మూడింటిలో విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టాప్-4లో కొనసాగుతున్నాయి. అఫ్గాన్ సెమీస్ చేరాలంటే.. చివరి మూడు మ్యాచ్‌ల్లో మూడింటిని మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది.

 World Cup 2023: How Can Afghanistan Reach Semi-Final After Sensational Win vs Sri Lanka

చివరి మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్.. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్ విజయం సాధిస్తే 12 పాయింట్లతో సెమీస్ రేసులో నిలుస్తోంది. నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా చివరి మూడింటిలో రెండు గెలిచినా.. 12 పాయింట్లతో అఫ్గాన్‌తో సమంగా నిలుస్తోంది.

అప్పుడు మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ముందంజ వేస్తోంది. అఫ్గాన్.. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచినా ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు ఉంటాయి. అలా జరగాలంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు మూడు జట్లు 10 పాయింట్లతో ఉంటాయి. నెట్‌ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న జట్లు సెమీస్ చేరుతాయి.

ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న సౌతాఫ్రికా.. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఓడినా.. అఫ్గాన్‌కు అవకాశాలు మెరుగవుతాయి. అదృష్టం కలిసొచ్చి అఫ్గాన్ సెమీస్ చేరితే.. సరికొత్త చరిత్ర నమోదవ్వనుంది.

Story first published: Tuesday, October 31, 2023, 20:01 [IST]
Other articles published on Oct 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+