Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఆస్ట్రేలియా‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

World Cup 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ అనూహ్యంగా జట్టుకు దూరమయ్యాడు. సరాదాగా గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన మ్యాక్స్‌వెల్ గాయపడ్డాడు. గోల్ఫ్ కార్ట్‌పై నుంచి అతను జారి పడినట్లు తెలుస్తోంది.

సోమవారం జరిగిన ఈ ఘటనలో మ్యాక్స్‌వెల్ తలకు గాయమైనట్లు సమాచారం. క్లబ్ హౌస్ నుంచి టీమ్ హోటల్‌కు వచ్చే క్రమంలో మ్యాక్స్‌వెల్ గోల్ఫ్ కార్ట్‌పై నుంచి పడినట్లు తెలుస్తోంది. తలకు గాయమైన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారం మ్యాక్స్‌వెల్‌ను 6 నుంచి 8 రోజుల పాటు మెడికల్ పర్యవేక్షణలో ఉంచనున్నారు.

 World Cup 2023: Glenn Maxwell ruled out of England match after falling from golf cart in freak accident

ఈ క్రమంలోనే అతను ఇంగ్లండ్‌తో శనివారం జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నాడు. నంబర్ 7న అఫ్గానిస్థాన్ జరిగే మ్యాచ్‌కు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అయితే మంచి విషయం ఏంటంటే మ్యాక్స్‌వెల్ గాయం మరీ పెద్దది కాకపోవడం. ఈ రెండు మ్యాచ్‌ల అనంతరం అతను జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

మ్యాక్స్‌వెల్ గైర్హాజరీతో ఆస్ట్రేలియా మార్కస్ స్టోయినీస్ లేదా కామెరూన్ గ్రీన్‌ను తుది జట్టులోకి తీసుకు రానుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ రికార్డు శతకాన్ని నమోదు చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

మ్యాక్స్‌వెల్ గైర్హాజరీ ఆస్ట్రేలియాకు నష్టం చేయనుంది. మ్యాక్సీ బ్యాటింగ్ కంటే అతని ఆఫ్ స్పిన్ ఆ జట్టుకు కీలకం. ఆడమ్ జంపా ఒక్కడే జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు. మ్యాక్స్‌వెల్ గైర్హాజరీలో ట్రావిస్ హెడ్ స్పిన్ బాధ్యతలు పంచుకోవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌తో జరిగిన గత మ్యాచ్‌తోనే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన ట్రావిస్ హెడ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

వరుసగా రెండు పరాజయాలతో టోర్నీని ప్రారంభించిన ఆసీస్.. ఆ తర్వాత అద్భుత ప్రదర్శనతో నాలుగు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ రేసులో నిలిచింది. సెమీస్ బెర్త్ ఖాయం కావాలంటే ఆ జట్టు చివరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్‌తో పాటు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లతో ఆసీస్ తలపడాల్సి ఉంది.

Story first published: Wednesday, November 1, 2023, 16:03 [IST]
Other articles published on Nov 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+