World Cup 2023 Final: పాపం స్మిత్.. అంపైర్ తప్పిదానికి బలి! (వీడియో)
IND vs AUS, World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(4) అంపైర్ తప్పిదానికి బలయ్యాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగిన స్మిత్.. రివ్యూ తీసుకోకపోవడం ఆసీస్‌కు నష్టం చేసింది.
జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. బుమ్రా వేసిన ఇన్ స్వింగర్‌ను అంచనా వేయడంలో విఫలమైన స్మిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి ప్యాడ్లను తాకడంతో భారత్ ఆటగాళ్లు గట్టిగా అప్పీల్ చేశాడు. అంపైర్ కూడా ఔటివ్వగా.. స్మిత్ ట్రావిస్ హెడ్‌ను రివ్యూ తీసుకోవాలా? అని అడిగాడు. అతను వద్దని చెప్పడంతో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.

కానీ రిప్లేలో బంతి ఇంపాక్ట్ ఔట్ సైడ్‌గా తేలింది. రివ్యూ తీసుకొని ఉంటే స్మిత్ నాటౌట్‌గా తేలేవాడు. ఈ వికెట్‌పై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంపైర్ తప్పుడు నిర్ణయానికి స్మిత్ బలయ్యాడని కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం మొత్తం భారత అభిమానులతో నిండి ఉండటం.. 127 డెసిబుల్స్ సౌండ్స్‌తో అరవడంతో అంపైర్ ప్రభావితమయ్యాడని కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం స్మిత్ అసమర్థతనే కారణమని కామెంట్ చేస్తున్నారు. అంపైర్ నిర్ణయాన్ని రివ్యూ రూపంలో సవాల్ చేసే అవకాశం ఉందని, ఉపయోగించకోకపోవడం అతని తప్పిదమేనని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ వికెట్ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన లబుషేన్‌తో కలిసి ట్రావిస్ హెడ్ జట్టును ఆదుకున్నాడు. భారీ భాగస్వామ్యంతో జట్టును విజయం దిశగా తీసుకెళ్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications