For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023 Final: కన్నీటి పర్యంతమైన రోహిత్, సిరాజ్! (వీడియో)

World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023లోనూ టీమిండియాకు నిరాశే ఎదురైంది. అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా.. కీలక మ్యాచ్‌లో తేలిపోయింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

టోర్నీ ఆసాంతం అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. ఫైనల్లో మాత్రం కనీస పోటీనివ్వకపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శనతో ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ పరాజయం 140 కోట్ల భారతీయులను దు:ఖంలోకి నెట్టివేసింది. టీమిండియా ఆటగాళ్లు అయితే ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు.

World Cup 2023 Final: Mohammad Siraj and Rohit Sharma crying and tears in his eyes

మ్యాచ్ పూర్తయిన వెంటనే మహమ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. రోహిత్ శర్మ సైతం తలదాచుకుంటూ నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరుగెత్తాడు. ఇతర ఆటగాళ్లు కూడా కెమెరాలకు తమ ముఖాలను చూపించుకోలేకపోయారు. విరాట్ కోహ్లీ ఒక్కడే ఆసీస్ ఆటగాళ్లందరితో మాట్లాడుతూ.. బాధను వ్యక్తం చేస్తూ అందరు వెళ్లిన తర్వాత మైదానం వీడాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియాను దురదృష్టం కూడా వెంటాడింది. ఒత్తిడిని తట్టుకోలేకపోవడం.. కీలక ఆటగాళ్లు విఫలమవ్వడం టీమిండియా ఓటమికి కారణమయ్యాయి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. . విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 4 ఫోర్లతో 53), కేఎల్ రాహుల్(107 బంతుల్లో ఫోర్‌తో 66), రోహిత్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47)లు మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137) విధ్వంసకర శతకంతో భారత్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మార్నస్ లబుషేన్(110 బంతుల్లో 4 ఫోర్లతో 58 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Sunday, November 19, 2023, 22:01 [IST]
Other articles published on Nov 19, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+