World Cup 2023 Final: టీమిండియా ఓటమి.. గౌతమ్ గంభీర్ ఏమన్నాడంటే..?
World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా మరోసారి గుండె కోతనే మిగిల్చింది. అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా.. తుదిపోరులో మాత్రం తేలిపోయింది. రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీ.. విరాట్ కోహ్లీ సెంచరీల మోత.. మహమ్మద్ షమీ అత్యధిక వికెట్ల ప్రదర్శన.. ఏవి కూడా టీమిండియాను విశ్వ విజేతగా నిలబెట్టలేకపోయాయి.
ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్‌లో సమష్టిగా విఫలమైన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌కు తోడు దురదృష్టం టీమిండియా పతనాన్ని శాసించింది.

తుది పోరులో ఓడినా.. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియాకు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు అండగా నిలుస్తున్నారు. ఫైనల్లో ఓడినా.. అద్వితీయమైన ప్రదర్శన అభిమానుల మనసులను గెలుచుకున్నారని రోహిత్ సేనను కొనియాడుతున్నారు.
ఈ ఓటమి 140 కోట్ల భారతీయులను బాధపెట్టినా.. ఫైనల్ చేరడం కూడా గొప్పేనని టీమిండియాకు అండగా నిలుస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు మాజీ క్రికెటర్లు రోహిత్ సేనకు అండగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. టీమిండియా ప్రదర్శనపై నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని వెల్లడించే గౌతమ్ గంభీర్ సైతం.. రోహిత్ సేనకు అండగా నిలిచాడు. ఫైనల్లో ఓడినా.. టీమిండియా ఛాంపియన్ అని కొనియాడాడు.
'ఫలితం ఎలా ఉన్నా నేను చెప్పినట్లు మనం ఛాంపియన్సే. కాబట్టి ఏ మాత్రం చింతించకండి బాయ్స్. విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా అభినందనలు'అని గంభీర్ ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. . విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 4 ఫోర్లతో 53), కేఎల్ రాహుల్(107 బంతుల్లో ఫోర్‌తో 66), రోహిత్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47)లు మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 137) విధ్వంసకర శతకంతో భారత్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మార్నస్ లబుషేన్(110 బంతుల్లో 4 ఫోర్లతో 58 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications