Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023 Final: కొంపముంచిన రోహిత్ దూకుడు.. ఆసీస్ ముందు ఈజీ టార్గెట్!

IND vs AUS, World Cup 2023 Final: ఎదురులేని ఆటతో వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరిన టీమిండియా అసలు సిసలు సమరంలో మాత్రం తడబడింది. బ్యాటింగ్‌కు ప్రతీకూలంగా ఉన్న వికెట్‌పై భారత బ్యాటర్లు తేలిపోయారు. విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 4 ఫోర్లతో 53), కేఎల్ రాహుల్(107 బంతుల్లో ఫోర్‌తో 66) హాఫ్ సెంచరీలతో రాణించగా.. రోహిత్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.

World Cup 2023 Final: Australia restrict India to 240/10

రోహిత్ చెలరేగినా..:ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(4) దారుణంగా విఫలమయ్యాడు. తనకు అచ్చొచ్చిన మైదానంలో ఫైనల్ ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో చెత్త షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను గ్లేన్ మ్యాక్స్‌వెల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనవసర షాట్‌తో రోహిత్ శర్మ(47) మూల్యం చెల్లించుకున్నాడు. ట్రావిస్ హెడ్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయకుండా దూకుడుగా ఆడే ప్రయత్నంలో రోహిత్ వికెట్ పారేసుకున్నాడు.

దెబ్బతీసిన కమిన్స్..:ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్(4)ను ప్యాట్ కమిన్స్ బోల్తా కొట్టించాడు. దాంతో టీమిండియా 81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైన ఈ జోడీ.. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్ నిర్మించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

67 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కమిన్స్ విడదీసాడు. తెలివైన బంతితో విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించాడు. స్లో షాట్ పిచ్ బాల్‌ను థర్డ్ మ్యాన్ దిశగా ఆడబోయిన విరాట్ కోహ్లీ.. బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఇన్‌సైడ్ ఎడ్జ్ అయిన బంతి కోహ్లీ వికెట్లను గీరాటేసింది.

రాహుల్ హాఫ్ సెంచరీ..:ఈ పరిస్థితుల్లో లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌ కోసం రవీంద్ర జడేజాను ప్రమోట్ చేసినా ఫలితం ఇవ్వలేదు. 22 బంతులాడిన జడేజా(9).. కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. జడేజా ఔటయ్యే ముందే రాహుల్ 86 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన సూర్యతో కలిసి భారీ స్కోర్ చేస్తాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. స్టార్క్ బౌలింగ్‌లో రాహుల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహమ్మద్ షమీ(6), జస్‌ప్రీత్ బుమ్రా(1) నిరాశపరచడంతో సూర్యకుమార్ యాదవ్ ఒంటరివాడయ్యాడు. కుల్దీప్ యాదవ్‌తో పోరాడిన సూర్య.. చివరకు నిర్లక్ష్యపు షాట్‌తో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన సిరాజ్(9 నాటౌట్).. చివరి ఓవర్‌లో విలువైన బౌండరీ బాదాడు. ఆఖరి బంతికి క్విక్ డబుల్ తీసే ప్రయత్నంలో కుల్దీప్ యాదవ్(10) రనౌటయ్యాడు.

Story first published: Sunday, November 19, 2023, 18:00 [IST]
Other articles published on Nov 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+