For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: టీమిండియాకు శనిలా దాపురించాడు.. అతను మాత్రం వద్దు బ్రో!

హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ బరిలోకి దిగుతాడని వస్తున్న వార్తలపై కొంతమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌‌లో కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వద్దని కోరుతున్నారు. అతని వల్ల ఇప్పటికే మూడు ప్రపంచకప్‌ల్లో విఫలమయ్యామని గుర్తు చేస్తున్నారు.

కేఎల్ రాహుల్.. ప్రతిభావంతమైన ఆటగాడే అయినా ఒత్తిడిని అధిగమించలేడని, ఈ మాటలు చెప్పింది టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ సింగ్ రాథోడేనని బీసీసీఐకి విజ్ఞప్తి చేస్తున్నారు. టీమ్‌కాంబినేషన్‌పై రోహిత్ శర్మ సీరియస్‌గా దృష్టి సారించాలని, సరైన కాంబినేషన్ కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నాడు. అవసరమైన కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించాలన్నాడు.

KL Rahul

రాహుల్‌ను వికెట్ కీపర్‌గా జట్టులో కొనసాగించి మిడిలార్డర్‌లో ఆడించడం అనవసరమని, కీలక టోర్నీల్లో అతను ఒత్తిడిని అధిగమించలేడని గుర్తు చేస్తున్నారు. 2021 టీ20 ప్రపంచకప్‌లోనూ కేఎల్ రాహుల్ వైఫల్యం కారణంగానే టీమిండియా నాకౌట్ చేరకుండా ఇంటిదారి పట్టిందని గుర్తు చేస్తున్నారు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌ల్లో రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు.

అతని వైఫల్యం రోహిత్ శర్మపై అనవసర ఒత్తిడిని తీసుకొస్తుందని, అతనికి బదులు లెఫ్టాండర్ అయిన ఇషాన్ కిషన్‌ను ఆడించడం జట్టుకు మేలని సూచిస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌తో పాటు 2022 టీ20 ప్రపంచకప్‌లోనూ రాహుల్ వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసిందని గుర్తు చేస్తున్నారు.

కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బరిలోకి దిగినా.. మిడిలార్డర్‌లో ఆడినా జట్టుకు ఒరిగేదేం లేదని కామెంట్ చేస్తున్నారు. వరల్డ్ కప్ టీమ్ ప్రణాళికల నుంచే అతన్ని తీసేసి లెఫ్టాండ్ బ్యాటర్లు అయిన యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. టీమిండియాకు శనిలా దాపురించాడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో జట్టులోకి తీసుకోవద్దని రోహిత్ శర్మకు రిక్వెస్ట్ చేస్తున్నారు.

ప్రస్తుత భారత జట్టులో రవీంద్ర జడేజా మినహా మరో లెఫ్టాండర్ లేడని, టాప్-5 బ్యాటర్లలో ఇద్దరూ లెఫ్టాండర్స్ ఉండేలా టీమ్ కాంబినేషన్‌ను సిద్దం చేయాలని రవిశాస్త్రి వంటి దిగ్గజ ఆటగాళ్లు ఇప్పటికే సూచించారు.

Story first published: Thursday, June 29, 2023, 19:15 [IST]
Other articles published on Jun 29, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+