Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఓరి ఆజాము.. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనేనా రా.. నీ ప్రతాపం?

హైదరాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరమైన రీతిలో ట్రోలింగ్ చేస్తున్నారు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమయ్యాడు.

18 బంతులు ఆడి 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. నెదర్లాండ్స్ బౌలర్ కొలిన్ అకర్‌మాన్ వేసిన క్విక్ షార్ట్‌ బాల్‌ను అంచనా వేయడంలో విఫలమై వికెట్ పారేసుకున్నాడు. ఈ బంతి లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేయగా మిస్ టైమ్ అయ్యి షార్ట్ మిడ్ వికెట్‌లో గాల్లోకి లేచింది. సకిబ్ సనాయసంగా క్యాచ్ అందుకున్నాడు.

 Babar Azam

ఇక ఇదే ఉప్పల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ 90 ప్లస్ రన్స్‌తో రాణించాడు. 48 గంటల వ్యవధిలోనే బాబర్ ఆజామ్ దారుణంగా విఫలమవ్వడాన్ని అభిమానులు సహించలేకపోతున్నారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన సమయంలో బాబర్ ఆజామ్ నిర్లక్ష్యంగా ఔటవ్వడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

'ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనేనా నీ ప్రతాపం?'అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. నెదర్లాండ్స్ బౌలింగే ఆడలేకపోతే.. భీకర ఫామ్‌లో ఉన్న భారత్, న్యూజిలాండ్, ఆసీస్ బౌలింగ్ ఎలా ఆడుతావని ప్రశ్నిస్తున్నారు. జట్టులో అనవసర రాజకీయాలు చేయడం ఆపి ఆటపై ఫోకస్ పెట్టాలని హితవు పలుకుతున్నారు.

ఉద్దేశ పూర్వకంగానే బాబర్ ఆజామ్.. సౌద్ షకీల్‌కు వామప్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఇవ్వలేదని, ఇప్పుడు అతనే జట్టును ఆదుకున్నాడని పాక్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బాబర్ ఆజామ్ పేరు మారుమోగుతోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పవర్ ప్లేలోనే పాకిస్థాన్ టాప్-3 బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది. ఫకార్ జమాన్(12), బాబర్ ఆజామ్(5), ఇమామ్ ఉల్ హక్(15) దారుణంగా విఫలమ్యారు. దాంతో పాక్ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

ఈ పరిస్థితుల్లో మహమ్మద్ రిజ్వాన్(75 బంతుల్లో 8 ఫోర్లతో 68), సౌద్ షకీల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 120 పరుగులు జోడించారు. అనంతరం ఈ ఇద్దరూ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్(9) కూడా విఫలమయ్యాడు. క్రీజులో మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ ఉండగా పాక్ 33 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులు చేసింది.

Story first published: Friday, October 6, 2023, 16:49 [IST]
Other articles published on Oct 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+