ENG vs SL: వన్డే ప్రపంచకప్ 2023 టైటిల్ రేసు నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తప్పకుంది. టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఘోర పరాజయాలతో మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
ఈ టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇది నాలుగో ఓటమి. చివరి నాలుగు మ్యాచ్‌లు గెలిచినా ఇంగ్లండ్ సెమీస్ చేరలేని పరిస్థితి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో తొలి మ్యాచ్‌లో రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడిన ఇంగ్లండ్.. చిత్తుగా ఓడింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచిన ఇంగ్లండ్.. అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది.

సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో మ్యాచ్‌లోనూ ఘోర పరాజయాన్ని చవిచూసింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ శ్రీలంక చేతిలో కంగుతిన్నది. అయితే ఇంగ్లండ్ ఘోర పరాజయంపై అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్‌ను అడ్డదారిలో గెలుచుకున్న ఇంగ్లండ్.. ఇప్పుడు పరిహారం చెల్లించుకుందని కామెంట్ చేస్తున్నారు.
బౌండరీ కౌంట్ అనే అసంబంద్దమైన నిబంధనతో టైటిల్ ఎగరేసుకుపోయిన ఇంగ్లండ్‌కు న్యూజిలాండ్ ఉసురు తగిలిందని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. అడ్డదారిలో తమ టైటిల్ లాక్కున్నా.. చిరు నవ్వుతో కేన్ మామ విధించిన శాపానికి ఇంగ్లండ్ విలవిలలాడుతుందని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.
వన్డే ప్రపంచకప్ ముందు అందరూ ఇంగ్లండ్ హాట్ ఫేవరేట్ అన్నారని, ఆ జట్టుదే టైటిలని కొనియాడారని, ఇప్పుడు ఏం అంటారని ప్రశ్నిస్తున్నారు. సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఇంగ్లండ్‌దే టైటిల్ అంటూ జోస్యం చెప్పారు. కానీ ఆ జట్టు మాత్రం కనీసం సెమీస్ కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది.
శ్రీలంకతో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(73 బంతుల్లో 6 ఫోర్లతో 43), జానీ బెయిర్ స్టో(31 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార(3/35), ఏంజెలో మాథ్యూస్(2/14), కాసున్ రజితా (2/36), మహీశ్ తీక్షణ(1/21) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 25.4 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్), సదీరవిక్రమా(54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.