Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: స్కోర్ కార్డ్ మాయం.. ఇదెక్కడి లైవ్‌రా అయ్యా!

హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 అధికారిక డిజిటల్ బ్రాడ్‌కాస్టర్ డిస్నీ హాట్‌స్టార్‌పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. వన్డే ప్రపంచకప్ పేరిట కోట్ల రూపాయలు సంపాదిస్తున్న హాట్ స్టార్.. ప్రేక్షకులకు మాత్రం క్వాలిటీ కంటెంట్ అందించలేకపోతుందని ఆరోపిస్తున్నారు.

క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా స్కోర్ కార్డు లేకుండా మ్యాచ్‌ను ప్రసారం చేసిన ఘనత హాట్‌స్టార్‌కే చెందుతుందని సెటైర్లు పేల్చుతున్నారు. ప్రపంచకప్ టోర్నీ రెండో రోజే ఈ సాంకేతిక లోపం బయటపడటం హాట్‌స్టార్ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

World Cup 2023

అసలేం జరిగిందంటే.. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య హైదరాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతుండగా.. స్టార్ స్పోర్ట్స్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. పాకిస్థాన్ బ్యాటింగ్ సందర్బంగా ఓ 20 నిమిషాల పాటు ఐసీసీ లోగోతో పాటు స్కోర్ కార్డులన్నీ మాయమయ్యాయి.

కేవలం ఆట మాత్రమే కనిపించింది. డిస్నీ హాట్ స్టార్ లోగో.. వ్యూయర్స్ సంఖ్య తప్పా స్క్రీన్‌పై మరే అక్షరం కూడా లేదు. ఇది చూసిన ప్రేక్షకులు, కామెంటేటర్లు అవాక్కయ్యారు. అప్పటికే పాకిస్థాన్ మూడు వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు మాజీ క్రికెటర్ రమీజ్ రాజా తనదైన శైలిలో సెటైర్లు వేసారు.

పాకిస్థాన్ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఉన్నట్లే హాట్‌స్టార్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లుందని కామెంట్ చేశాడు. స్కోర్ బోర్డు లేకుండా మ్యాచ్ చూడటం అభిమానలకు చిరాకుగా అనిపించింది. దాంతో నెటిజన్లు ఎక్స్ వేదికగా డిస్నీ హాట్‌స్టార్‌పై ట్రోలింగ్‌కు దిగారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(75 బంతుల్లో 8 ఫోర్లతో 68), సౌద్ షకీల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 68) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మహమ్మద్ నవాజ్(43 బంతుల్లో 4 ఫోర్లతో 39), షాదాబ్ ఖాన్(34 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 32) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడ్(4/62) నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. కొలిన్ అకెర్‌మన్(2/39) రెండు వికెట్లు తీసాడు. ఆర్యన్ దత్, లోగన్ వాన్ బీక్, పాల్ వాన్ మీకెరెన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ ఓటమి దిశగా సాగుతోంది. పాక్ బౌలర్ల ధాటికి 164 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. బౌలింగ్‌లో 4 వికెట్లతో సత్తా చాటిన బాస్ డీ లీడే(68 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67)‌తో పాటు ఓపెనర్ విక్రమ్‌జీత్ సింగ్(67 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. తెలుగు తేజం తేజ నిడమనూరు(5) తీవ్రంగా నిరాశపరిచాడు.

Story first published: Friday, October 6, 2023, 21:01 [IST]
Other articles published on Oct 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+