World Cup 2023: షమీ భయ్యా.. ఆ వికెట్లలో నీ పెళ్లాం కనబడుతుందా?
World Cup 2023: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దుమ్మురేపుతున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. టచ్ చేస్తే క్యాచ్.. మిస్ అయితే వికెట్ అన్నట్లుగా ఈ వెటరన్ పేసర్ చెలరేగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా సాధించిన గత మూడు మ్యాచ్‌ల్లో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు. హార్దిక్ పాండ్యా గాయంతో తుది జట్టులోకి వచ్చిన షమీ అనూహ్య ప్రదర్శనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
న్యూజిలాండ్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. బంగ్లాదేశ్‌పై నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ 5 వికెట్లు పడగొట్టి ఆల్‌టైమ్ రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ.. జహీర్ ఖాన్‌ను వెనక్కినెట్టాడు.

మెగా టోర్నీలో మూడోసారి ఐదు వికెట్ల ఘనతను అందుకొని ఈ ఫీట్ సాధించిన మిచెల్ స్టార్క్‌తో సమంగా నిలిచాడు. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్‌లే ఆడిన షమీ.. 22 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 14 వికెట్లు పడగొట్టాడు. షమీ సంచలన ప్రదర్శనపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.
భార్యపై కోపాన్ని బంతిపై చూపిస్తున్నావా? బ్రో అని ఒకరంటే.. ఆ వికెట్లలో తన సతీమణిని చూసుకుంటున్నాడని మరొకరు సెటైర్లు పేల్చారు. ప్రస్తుతం ఈ మీమ్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

గత మూడేళ్లుగా మహమ్మద్ షమీ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. అతని వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలున్నాయి. తన మాజీ భార్య హసీన్ జహాన్ వేధింపులు, విడాకుల కేసు, తన కూతురును తనకు కాకుండా చేయడంతో ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని కూడా షమీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. షమీ స్త్రీలోలుడని, అతని కుటుంబం తనను లైంగికంగా వేధించిందని, అతను ఫిక్సింగ్‌కు పాల్పడంతో పాటు ఏజ్ ఫ్రాడ్ కూడా చేశాడని హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది.
వీటిపై సమగ్ర విచారణ జరిపిన బీసీసీఐ అతనికి క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ ఆరోపణలన్నింటికీ మౌనం వహించిన షమీ.. తన ఆటతోనే బదులిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications