World Cup 2023: న్యూజిలాండ్‌తో సెమీస్.. ఆ ఐరెన్ లెగ్ అంపైర్ లేడు!
Richard kettleborough: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి సెమీస్ మ్యాచ్ అఫిషియల్స్‌ను ఐసీసీ ప్రకటించింది. బుధవారం ముంబై వేదికగా జరిగే ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, రాడ్ టక్కర్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా.. జోయెల్ విల్సన్ మూడో అంపైర్‌గా సేవలందించనున్నాడు. ఫోర్త్ అంపైర్‌గా ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్, మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
తొలి సెమీఫైనల్ అఫిషియల్స్ జాబితాపై భారత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాబితాలో రిచర్డ్ కెటిల్ బరో లేకపోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశమని, రోహిత్ సేన ప్రపంచకప్ గెలవడం ఖామయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా భారత్ ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి కెటిల్ బరోనే కారణమని, ఈసారి అతను లేడు కాబట్టి భారత్ విజయం లాంఛనమేనని కామెంట్ చేస్తున్నారు.

చివరిసారిగా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆ టోర్నీ తర్వాతి నుంచి టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ గెలవలేదు. ముఖ్యంగా కెటిల్ బరో అంపైరింగ్ చేసిన నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రతికూల ఫలితమే వచ్చింది.

2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2016 టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో కెటిల్ బరో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించగా.. భారత్ ఓటమిపాలైంది.
2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ అయిన సమయంలో లెగ్ అంపైర్‌గా ఉన్నా కెటిల్ బరో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఇప్పటికీ భారత అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటోంది. ఈ క్రమంలోనే కెటిల్ బరోను భారత అభిమానులు ఐరెన్ లెగ్ అంపైర్‌గా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే న్యూజిలాండ్‌తో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు కెటిల్ బరో లేడని తెలుసుకొని తెగ సంతోషపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications