Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: రోహిత్ శర్మ కెప్టెన్సీ సూపరో సూపర్!

చెన్నై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ తన కెప్టెన్సీ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు. అతని ఫీల్డింగ్ సెటప్, బౌలింగ్ మార్పులు స్పాట్ ఆన్ ఉండటంతో రోహిత్ శర్మ సారథ్యాన్ని అభిమానులతో పాటు కామెంటేటర్లు కొనియాడుతున్నారు.

మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ మార్పులు చేస్తూ రోహిత్ వరుస విరామాల్లో వికెట్లు రాబట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మిచెల్ మార్ష్‌కు జస్‌ప్రీత్ బుమ్రాతో చెక్ పెట్టిన రోహిత్ శర్మ.. ధాటిగా ఆడుతున్న డేవిడ్ వార్నర్‌ను కుల్దీప్ యాదవ్‌తో బోల్తా కొట్టించాడు. ఓవైపు బౌలింగ్‌తో.. మరోవైపు సూపర్ ఫీల్డింగ్‌తో పరుగులివ్వకుండా బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చాడు.

World Cup 2023: Fans and Commentators Hails Rohit Sharma Captaincy against Australia

రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లతో బౌలింగ్ చేయిస్తూనే సిరాజ్‌ను పట్టుకొచ్చాడు. ఆ తర్వాత జడేజాను రంగంలోకి దింపి వికెట్లను రాబట్టాడు. క్రీజులో పాతుకుపోయిన స్టీవ్ స్మిత్‌ను జడేజా స్టన్నింగ్ డెలివరీ క్లీన్ బౌల్డ్ చేయగా.. లబుషేన్, అలెక్స్ క్యారీలను ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్‌‌కు బుమ్రాతో బౌలింగ్ వేయించి.. అనూహ్యంగా కుల్దీప్‌ను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు.

అప్పటికే డాట్ బాల్స్ ఎక్కువవుతుండటంతో సహనం కోల్పోయిన మ్యాక్స్‌వెల్.. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే అశ్విన్‌ను రంగంలోకి దింపి కామెరూన్ గ్రీన్‌‌కు ఉచ్చు బిగించాడు. హార్దిక్ పాండ్యా సాయంతో బుట్టలో వేసుకున్నాడు. భారత స్పిన్నర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీ తోడవ్వడంతో ఆసీస్ 140 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీపై కామెంటేటర్ల ఇర్ఫాన్ పఠాన్, మైఖేల్ క్లార్క్, ఆరోన్ ఫించ్, రవి శాస్త్రి ప్రశంసల జల్లు కురిపించారు. రోహిత్ శర్మ ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులు స్పాట్ ఆన్ ఉన్నాయని కొనియాడారు.

Story first published: Sunday, October 8, 2023, 17:40 [IST]
Other articles published on Oct 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+