Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023లో సంచలనం.. ఇంగ్లండ్‌పై అఫ్గాన్ ఘన విజయం!

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023లో సంచలన ఫలితం నమోదైంది. పసికూన అఫ్గానిస్థాన్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అసాధారణ ప్రదర్శనతో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌‌ను మట్టికరిపించింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన అఫ్గానిస్థాన్ 69 పరుగుల తేడాతో గెలుపొందింది.

రషీద్ ఖాన్(3/37), ముజీబ్ ఉర్ రెహ్మాన్(3/51) తీన్మార్ బౌలింగ్‌తో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 49.5 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్(57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 80), ఇక్రామ్ అలిఖిల్(66 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

World Cup 2023: England suffer shock defeat as Rashid, Mujeeb bag 3-wicket hauls for Afghanistan

చివర్లో రషీద్ ఖాన్(22 బంతుల్లో 3 ఫోర్లతో 23), ముజీబ్ ఉర్ రెహ్మాన్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్(3/42) మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్(2/50) రెండు వికెట్లు పడగొట్టాడు. లియామ్ లివింగ్‌స్టోన్(1/33), జోరూట్(1/19)తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ 40.3 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. హ్యారీ బ్రూక్(61 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 66) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ నబీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫజలక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీసారు.

285 పరుగుల సాధారణ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జానీ బెయిర్ స్టో(2), జోరూట్(11) తీవ్రంగా నిరాశపరిచారు. హ్యారీ బ్రూక్ సాయంతో డేవిడ్ మలాన్ ఆచితూచి ఆడటంతో ఇంగ్లండ్ పవర్ ప్లేలో 2 వికెట్లకు 52 పరుగులే చేసింది. ఆచితూచి ఆడుతున్న డేవిడ్ మలాన్‌(32) మహమ్మద్ నబీ ఔట్ చేయగా.. జోస్ బట్లర్(9)ను నవీన్ ఉల్ హుక్ పెవిలియన్ చేర్చాడు.

లియామ్ లివింగ్ స్టోన్(10)ను రషీద్ ఖాన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 117 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సామ్ కరణ్(10), క్రిస్ వోక్స్(9) కూడా విఫలమవ్వడంతో ఇంగ్లండ్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు పరుగులు రాబట్టిన హ్యారీ బ్రూక్ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఆ తర్వాత కూడా కాస్త దూకుడుగా ఆడిన అతన్ని ముజీబ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయామైంది. ఆదిల్ రషీద్(20), మార్క్‌వుడ్(18), రీస్ టోప్లీ(15 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది.

Story first published: Sunday, October 15, 2023, 21:37 [IST]
Other articles published on Oct 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+