హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. పుష్పా ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్‌తో ఆకట్టుకున్నాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్.. పుష్ప ట్రేడ్ మార్క్ డైలాగ్స్, డ్యాన్స్‌లతో అభిమానులను అలరించాడు.
ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో క్యాచ్ పట్టి తగ్గేదేలే అంటూ కామెంట్ చేశాడు. అనంతరం శ్రీవల్లి సాంగ్‌కు కాలు కదిపాడు.ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇక తెలుగు సినిమాలు, ప్రజలతో వార్నర్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సుమారు ఏడేళ్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన వార్నర్.. ఇక్కడి ప్రజల అభిమానానికి ఫిదా అయ్యాడు. తెలుగు సంప్రదాయాలను బాగా ఇష్టపడే వార్నర్.. తెలుగు సినిమాలను కూడా ఫాలో అవుతాడు. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన అల్లు అర్జున్‌ను వార్నర్ అభిమానిస్తాడు.
అల్లు అర్జున్‌తో పాటు తెలుగు స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌ల సినిమాలు ఫాలో అయిన వార్నర్ వారి సాంగ్స్, డైలాగ్‌లకు స్పూఫ్ వీడియోలు కూడా చేశాడు. కరోనా లాక్‌డౌన్‌లో వార్నర్ తన టిక్‌టాక్ వీడియోలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. తాజాగా పాకిస్థాన్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో పుష్పా సాంగ్స్‌కు చిందేసి అభిమానులను అలరించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 351 పరుగులు చేసింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌లతో 77), కామెరూన్ గ్రీన్(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించారు. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 48), జోష్ ఇంగ్లీష్(30 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 48) తృటిలో హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు.
పాకిస్థాన్ బౌలర్లలో ఉసామా మీర్ రెండు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్, మహమ్మద్ వాసీమ్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 46.3 ఓవర్లలో 8 వికెట్లకు 330 పరుగులు చేసింది. ఇఫ్తికర్ అహ్మద్(85 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83), బాబర్ ఆజామ్(59 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 90) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. మహమ్మద్ నవాజ్(42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, మార్నస్ లబుషే, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు.