Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ఇదెక్కడి అభిమానంరా.. అయ్యా!

Hyderabad Biriyani for David Warner: ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కోసం ఓ హైదరాబాద్ అభిమాని చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్స్‌లతో 163) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.

మైదానం లోపల వార్నర్ పరుగుల మోత మోగిస్తే.. స్టేడియం బయట సదరు హైదరాబాద్ ఫ్యాన్ ప్లకార్డ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ప్లకార్డ్‌పై 'డేవిడ్ భాయ్ నీకోసం హైదరాబాదీ బిర్యానీ పట్టుకొచ్చాను'అని పేరుకున్నాడు. ఈ హైదరాబాద్ అభిమాని పట్టుకున్న ప్లకార్డు నెట్టింట వైరల్‌గా మారింది. ఇదెక్కడి అభిమానంరా అయ్యా.. అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

World Cup 2023: Crazy fan brings Biryani from Hyderabad for David Warner during AUS vs PAK Match

తెలుగు రాష్ట్రాల అభిమానులతో వార్నర్‌కు మంచి రిలేషన్ ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సుదీర్ఘ కాలం ఆడిన వార్నర్.. ఇక్కడి అభిమానులతో మమేకమయ్యాడు. టిక్ టాక్ సాయంతో తెలుగు డైలాగ్స్, పాటలకు డ్యాన్స్ చేస్తూ ప్రత్యేక అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వార్నర్‌ను తెలుగు ప్రజలంతా తమవాడిలా భావిస్తారు.

సన్‌రైజర్స్‌ను వీడినా వార్నర్.. తెలుగు అభిమానులతో ఉన్న అటాచ్‌మెంట్‌ను కొనసాగిస్తున్నాడు. తాజా మ్యాచ్‌లోనూ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్.. పుష్ప ట్రేడ్ మార్క్ సెలెబ్రేషన్స్‌తో అలరించాడు. నీ అవ్వ తగ్గేదేలే అంటూ సంబరాలు జరుపుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వచ్చిన లైఫ్‌తో చెలరేగిన వార్నర్.. పాకిస్థాన్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. విధ్వంసకర సెంచరీతో ఆసీస్‌కు భారీ స్కోర్ అందించడంతో పాటు పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

పాకిస్థాన్ మీద వన్డేల్లో వరుసగా నాలుగో సెంచరీ నమోదు చేసిన వార్నర్.. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ అత్యధిక స్కోరు కొట్టిన ఆసీస్ బ్యాటర్‌గానూ డేవిడ్ వార్నర్ నిలిచాడు.

ఈ తరం క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్లలో వార్నర్ రెండో ప్లేసులో ఉన్నాడు. 78 అంతర్జాతీయ సెంచరీలతో కోహ్లి ఈ జాబితాలో ఫస్ట్ ప్లేసులో ఉండగా..47 సెంచరీలతో వార్నర్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 46 సెంచరీలతో జో రూట్, 45 శతకాలతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తర్వాతి స్థానాలలో ఉన్నారు.

Story first published: Friday, October 20, 2023, 22:12 [IST]
Other articles published on Oct 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+