Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. ఆ ఆల్‌టైమ్ రికార్డ్‌ను కోహ్లీ సాధించేనా..?

IND vs NED: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్దమైంది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగే మ్యాచ్‌‌‌లో నెదర్లాండ్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌ను సన్నాహకంగా వాడుకోనుంది. ఈ క్రమంలో బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది.

అశ్విన్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌లతో పాటు ప్రసిద్ కృష్ణాలను బరిలోకి దించనుంది. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చవద్దని భావిస్తే మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు.

World Cup 2023: Can Virat Kohli score a record 50th ODI ton in the Netherlands match?

ఈ మ్యాచ్‌ ఓడినా.. గెలిచినా టీమిండియా కలిగే నష్టం ఏం లేదు. కానీ కీలక సెమీస్ పోరుకు ముందు ఓడితే జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా పసికూన చేతిలో ఓడారనే అపరాధన ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రభావం చూపనుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని టీమిండియా భావిస్తోంది.

విరాట్ కోహ్లీ 50వ సెంచరీ కొట్టేనా..:
ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం కంటే విరాట్ కోహ్లీ 50వ సెంచరీ సాధిస్తాడా? అనేదే చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉండటం.. ఈ గ్రౌండ్ విరాట్ కోహ్లీకి సెకండ్ హోమ్ గ్రౌండ్ కావడంతో 50 సెంచరీ బాదడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనే 49వ సెంచరీ బాది సచిన్ రికార్డ్ సమం చేసిన కోహ్లీ.. మరో శతకం బాదితే ఆల్‌టైమ్ రికార్డు అందుకోనున్నాడు. అంతేకాకుండా ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో విరాట్(543) మూడో స్థానంలో ఉన్నాడు. క్వింటన్ డికాక్(591) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

తుది జట్లు(అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్/ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, జడేజా/అశ్విన్, కుల్దీప్ యాదవ్, షమీ, సిరాజ్, బుమ్రా/ప్రసిద్ద్

నెదర్లాండ్స్: వెస్లీ బర్రెసి, మ్యాక్స్‌ ఓడౌడ్, కొలిన్ అకెర్‌మన్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), బాస్ డిలీడే, తేజా నిడమనూరు, లొగన్ వాన్ బీక్, వాండర్ మెర్వ్, ఆర్యన్ దత్, వాన్ మీకెరెన్

Story first published: Saturday, November 11, 2023, 22:46 [IST]
Other articles published on Nov 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+