న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ముందు సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాలతో ఆ జట్టు కెప్టెన్ టెంబా బవుమా టీమ్‌ను వదిలి స్వదేశం వెళ్లిపోయాడు. ప్రపంచకప్ నేపథ్యంలో జరిగే రెండు వాపమ్ మ్యాచ్‌లకు టెంబా బవుమా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అతని గైర్హాజరీలతో ఎయిడెన్ మార్క్‌రమ్ జట్టును నడిపించనున్నాడు.
కుటుంబ కారణాలతోనే బవుమా జట్టును వీడినట్లు తెలుస్తోంది. అతని కుటుంబంలో ఎవరో తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఇక ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోపు టెంబా బవుమా జట్టుతో కలుస్తాడని క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది.

'అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌లకు టెంబా బవుమా దూరమయ్యాడు. అతని గైర్హాజరీలతో ఎయిడెన్ మార్క్‌రమ్ జట్టును నడిపించనున్నాడు.'అని క్రికెట్ సౌతాఫ్రికా ఓ ప్రకటనలో పేర్కొందింది.
శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో తొలి వామప్ మ్యాచ్ ఆడనున్న సౌతాఫ్రికా.. అక్టోబర్ 02న న్యూజిలాండ్‌తో రెండో వామప్ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచకప్ 2023లో భాగంగా తొలి మ్యాచ్‌ను ఢిల్లీ వేదికగా శ్రీలంకతో ఆడనుంది. ఇప్పటికే భారత్ చేరిన సౌతాఫ్రికా టీమ్.. తిరువనంతపురం ముమ్మర సాధన చేస్తోంది.
సౌతాఫ్రికా వన్డే ప్రపంచకప్ టీమ్: టెంబా బవుమా(కెప్టెన్), గెరాల్డ్ కోయిట్జీ, క్వింటన్ డికాక్, రీజా హెన్రీక్స్, మార్కో జాన్సెన్, హెన్రీచ్ క్లాసెన్, ఆండిలే పెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, లిజాడ్ విలియమ్స్, కగిసో రబడా, టబ్రైజ్ షంసీ, రాసీ వన్ డెర్ డస్సెన్.